యాస చూసి నవ్వుతున్నారు..

పల్లెటూరి అమ్మాయిని. చాలా కష్టపడి ఉద్యోగంలో చేరా. కాస్త నా యాస భిన్నంగా ఉంటుంది. ఏం మాట్లాడినా టీమ్‌ సభ్యులు నవ్వుతారు. మీటింగ్‌లోనూ అంతే! చెప్పే విషయం వినకుండా నా మాటల మీద జోకులేస్తుంటారు. ఇబ్బందిగా ఉంది. మాట్లాడాలంటేనే తెలియని బెరుకు. ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలి?

Updated : 15 Nov 2023 04:32 IST

పల్లెటూరి అమ్మాయిని. చాలా కష్టపడి ఉద్యోగంలో చేరా. కాస్త నా యాస భిన్నంగా ఉంటుంది. ఏం మాట్లాడినా టీమ్‌ సభ్యులు నవ్వుతారు. మీటింగ్‌లోనూ అంతే! చెప్పే విషయం వినకుండా నా మాటల మీద జోకులేస్తుంటారు. ఇబ్బందిగా ఉంది. మాట్లాడాలంటేనే తెలియని బెరుకు. ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలి?

-ఓ సోదరి

బృంద సభ్యుల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఏర్పడాలన్నా.. పని సజావుగా సాగాలన్నా మంచి కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ తప్పనిసరి. అందుకే రంగమేదైనా ఈ నైపుణ్యం ఉందా అని తప్పక చూస్తారు. పని చేసే చోటే కాదు తెలియని ప్రదేశం.. నలుగురిలో కలవాలన్నా భాషే ప్రధానం కదా! కాబట్టి దాని ప్రాధాన్యం గుర్తించాల్సిందే. మాతృభాషలో పనిచేసే సౌకర్యం వేరే వాటిల్లో ఉండకపోవడం సహజమే. దీంతో తప్పులు దొర్లుతుంటాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వాళ్లు ఇలాంటి ఇబ్బందులు ఎక్కువగా ఎదుర్కొంటారు. పదం, వాక్యం పలకడంలో పొరపాటు చేస్తే ఒక్కోసారి అపార్థాలకూ దారి తీస్తుంది. అదీకాక ఇంగ్లిష్‌ సరిగా మాట్లాడలేని వారికి ఏమీ తెలియదనే అపోహ చాలామందిలో ఉంటుంది. దీంతో సహోద్యోగులు, క్లయింట్లు కూడా వారిని సీరియస్‌గా తీసుకోరు. పదోన్నతుల విషయంలోనూ వెనకపడిపోతారు. మీ విషయంలో జరుగుతోంది ఇదే! అలాగని కుంగిపోవొద్దు. కాస్త శ్రద్ధపెట్టండి. భాషా నైపుణ్యాలు నేర్చుకోవడం కష్టమేమీ కాదు. కొత్త యాప్‌ వాడటం, వంట చేయడం, వాహనాలు నడపడం.. ఇవేమీ పుట్టుకతోనే రావు కదా! నెమ్మదిగా నేర్చుకుంటాం. ఇదీ అంతే. కాకపోతే ఎక్కువ సాధన చేయాలి. కొత్తపదాలు తెలుసుకుంటూ, వాటిని ఎలా పలకాలన్నది గమనించుకుంటూ ఉండండి. భయపడుతూ కూర్చోవద్దు. సీరియస్‌గా నేర్చుకోండి. కష్టపడేతత్వానికి దాన్ని వ్యక్తపరిచే భాషానైపుణ్యాలూ తోడైతే విజయం, మీరు కోరుకున్న గుర్తింపు తప్పక దక్కుతాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్