ఆ కొవ్వు.. జెల్స్‌తో తగ్గుతుందా?

వెనక, నడుము పక్కన కొవ్వు పేరుకున్నట్లుగా కనిపిస్తుంది. జెల్స్‌ వాడితే తగ్గుతాయి అంటున్నారు. నిజమేనా? పోగొట్టుకోవడానికి మరేదైనా చేయాలా?

Published : 21 Jan 2024 02:04 IST

వెనక, నడుము పక్కన కొవ్వు పేరుకున్నట్లుగా కనిపిస్తుంది. జెల్స్‌ వాడితే తగ్గుతాయి అంటున్నారు. నిజమేనా? పోగొట్టుకోవడానికి మరేదైనా చేయాలా?

ఓ సోదరి

జెల్స్‌తో కొవ్వు తగ్గుతుంది అనుకోవడం అపోహే! డబ్బు వృథా తప్ప ప్రయోజనం ఉండదు. లైపో వంటి సర్జరీలు చేయించుకోవచ్చు కానీ చాలామంది భయపడతారు. అలాంటివాళ్లు నాన్‌సర్జికల్‌ మార్గాలను ప్రయత్నించొచ్చు. అయితే ఇవి బరువు తగ్గడానికి కాదు. వయసు, ఎత్తుకు తగ్గ బరువున్నా కొందరికి అక్కడక్కడా కొవ్వు పేరుకొనిపోయి కనిపిస్తుంది. వ్యాయామాలు, డైట్‌ నియమాలు పాటించినా తగ్గడం లేదు అనుకున్నవారికి ఇవి ప్రయోజనకరం. వాటిల్లో... క్రయోలైపోలైసిస్‌... దీంట్లో సర్జరీ, నీడిలింగ్‌ వంటివేమీ ఉండవు. కూలింగ్‌ పద్ధతిలో కొవ్వును గడ్డకట్టించి, తగ్గేలా చేస్తారు. ఇతర శరీర భాగాలకూ ఎలాంటి హానీ ఉండదు. అరగంట నుంచి గంట పడుతుంది. లేజర్‌ లైపోలైసిస్‌ కంట్రోల్‌లో లేజర్‌ ద్వారా వేడిని పంపి, కొవ్వు కణాలు కరిగేలా చేస్తారు. 12 వారాలలోపు మృతకొవ్వు కణాలు సహజంగా బయటికి వచ్చేస్తాయి. సెషన్‌ పూర్తవడానికి 25 నిమిషాలు పడుతుంది. రేడియో ఫ్రీక్వెన్సీ లైపోలైసిస్‌.. అల్ట్రా సౌండ్‌ టెక్నాలజీ ద్వారా కొవ్వు తొలగిస్తారు. ఇది పూర్తవడానికి గంట వరకూ పడుతుంది. ఇంజెక్టబుల్‌ లైపోలైసిస్‌... ఇది శరీరానికి పనికి రాదు. డబుల్‌ చిన్‌, కళ్లకింద క్యారీబ్యాగులు వంటి చిన్న వాటికి దీన్ని ఉపయోగిస్తాం. అయితే దీంతో ఆ ప్రాంతంలో వాయడం, ఎర్రబడటం లాంటి కొన్ని సైడ్‌ఎఫెక్ట్‌లూ ఉంటాయి. వీటన్నింటికీ మల్టిపుల్‌ సెషన్లు తప్పనిసరి. పూర్తిగా కొవ్వును తొలగించేస్తాయనీ చెప్పలేం. కానీ చాలావరకూ ప్రభావం కనిపిస్తుంది. రిస్క్‌ ఉండదు. ఖరీదూ ఎక్కువే. పూర్తి మార్పు కావాలంటే మాత్రం సర్జికల్‌ లైపోలైసిస్‌ తీసుకోవడం మేలు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్