ఆ దద్దుర్లని ఏమంటారు?

ఆర్మ్‌పిట్స్‌(బాహుమూల)ల్లో చిన్న దద్దురులా వచ్చింది. దాన్ని ఒత్తితే నల్లగా చీము బయటికి వస్తోంది. ఇదేమైనా సమస్యా. ఎలా తగ్గుతుంది?

Updated : 28 Jan 2024 04:37 IST

ఆర్మ్‌పిట్స్‌(బాహుమూల)ల్లో చిన్న దద్దురులా వచ్చింది. దాన్ని ఒత్తితే నల్లగా చీము బయటికి వస్తోంది. ఇదేమైనా సమస్యా. ఎలా తగ్గుతుంది?

ఓ సోదరి

బాహుమూలల్లో ఇలా దద్దురులా రావడాన్ని హైడ్రాడెనిటిస్‌ లేదా యాక్నెఇన్వర్సా అంటాం. దీర్ఘకాలం వేధించే చర్మ సమస్య ఇది. చంకల్లో బంఠానీ గింజ పరిమాణంలో గడ్డల్లా ఏర్పడతాయి. ఇవి జన్యుపరంగా లేదా ఇన్‌ఫెక్షన్లూ, ఇన్‌ఫ్లమేషన్‌ల వల్లా రావొచ్చు. చెమట, జిడ్డు ఎక్కువగా ఉన్నవారిలో కూడా కనిపిస్తాయి. అలాగే యాక్నె, ఆర్థరైటిస్‌, డయాబెటిస్‌ ఉన్నవారిలోనూ చూస్తుంటాం. చికిత్సతో కొంతవరకు మేనేజ్‌ చెయొచ్చు. కానీ పూర్తిగా నయం కాదు. ఒక్కోసారి తగ్గడానికి కొన్ని సంవత్సరాలు  పడుతుంది. కొన్నిసార్లు ఇవి నొప్పిగా ఉండి వీటి నుంచి నల్లటి రంగులో చీము వస్తుంది. ఆ కారణంగా అక్కడి చర్మం నల్లబడుతుంది. మచ్చలూ వస్తాయి. చాలావరకు యుక్తవయసులోనే ఈ సమస్య ప్రారంభమవుతుంది. అంటే 16 నుంచి 40లోపే వస్తాయి. వీటివల్ల చాలా అసౌకర్యంగా ఉంటుంది. కొన్నిసార్లు చేయి కూడా సరిగా పైకిలేపలేరు. ఇవి మొదట బ్లాక్‌ హెడ్స్‌లా మొదలవుతాయి. సమస్య తీవ్రంగా ఉంటే మెడికల్‌ సర్జికల్‌ ట్రీట్‌మెంట్‌ ద్వారా నయం చేయొచ్చు. ముందే గుర్తిస్తే టాపికల్‌, ఓరల్‌ మందుల ద్వారా నయం చేయొచ్చు. యాంటీబయాటిక్‌ క్రీమ్స్‌ అంటే టాపికల్‌ క్లిండామైసిన్‌ వంటివి రోజుకు రెండుసార్లు అప్లై చేసుకోవాలి. ఓరల్‌ పెయిన్‌ కిల్లర్స్‌, హార్మోనల్‌ థెరపీ ద్వారానూ తగ్గించొచ్చు. టాపికల్‌ యాంటీబయోటిక్‌, టాపికల్‌ రెటినోయిడ్‌ క్రీముల వల్ల బెటర్‌ అవుతుంది. ఈ క్రీములతో కంట్రోల్‌ అవ్వకపోతే అప్పుడు సర్జికల్‌ ట్రీట్‌మెంట్‌ తీసుకోవాల్సి వస్తుంది. అలానే లేజర్‌ ట్రీట్‌మెంట్‌ కూడా ఉంటుంది. మీ కండిషన్‌ బట్టి ఏది అవసరమో డాక్టర్‌ను సంప్రదించి తీసుకోవాలి. చాలా వరకు మీకు టాపికల్‌, ఓరల్‌ యాంటీబయాటిక్స్‌ క్రీములతో తగ్గే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్