చిన్నప్పటి నుంచే పిల్లలకి నైతిక విలువలతో కూడిన విద్యనందించాలి. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం కాకుండా ప్రతి అమ్మాయికి స్వీయ రక్షణ విద్యలు నేర్పించాలి. అదేసమయంలో అబ్బాయిలకు అక్క, చెల్లి, తల్లి బంధాల్లోని మాధుర్యాన్ని చిన్నప్పటి నుంచే అర్థమయ్యేలా వివరించాలి. ఇక సినిమాలు, సామాజిక మాధ్యమాలకు కచ్చితంగా ఒక పరిధి ఉండాలి. ముఖ్యంగా స్త్రీల వస్త్రాల గురించి ప్రభుత్వం, సెన్సార్ కఠినమైన నిబంధనలు విధించాలి. సమాజంలో అశ్లీలతకు తావు లేకుండా మంచి వాతావరణం నిండిన రోజు ఇటువంటి ఆకృత్యాలు జరగవు. ఇది ఏ ఒక్కరి బాధ్యతో కాదు.. మనందరి బాధ్యత! చట్టాలు, శిక్షలు కూడా కఠినంగా ఉండాలి.
ఉద్దగిరి తులసి రాజేశ్వరి