స్వర్గీయ రామోజీరావు గారి మానస పుత్రిక ‘ఈనాడు వసుంధర’తో మీకున్న ఆత్మీయ అనుబంధం.. అనునిత్యం ‘వసుంధర’ మీలో స్ఫూర్తి రగిలిస్తున్న వైనం.. మొదలైన అంశాల గురించి పంచుకోండి.

Updated : 13 Jun 2024 15:36 IST

మీ సమాధానం

పాఠకుల కామెంట్స్

My day does not end without reading online Vasundhara edition of Eenadu. My mom introduced me to Eenadu Vasundhra page. She used to cut and save those pages and articles and make us read. I am big fan of every segment of Vasundhara.. Super Women, Beauty & Fashion, Sweet Home, Aarogyamasthu, etc. Especially, I get inspired by various interviews and successful life stories they publish on women achievers. Thank you Late Sri Ramoji Rao garu for this wonderful VASUNDHARA. We always remember you Sir. Namasthe!
Uma Mudumba
ఎంతోమందికి స్ఫూర్తిప్రదాత, మానవతామూర్తికి.. మహిళామణులందరి తరఫున నమస్సుమాంజలి! రామోజీరావు గారి మానస పుత్రిక 'వసుంధర' గురించి ఏమని చెప్పాలి? ఎంత చెప్పినా తక్కువే! రోజూ ఉదయమే 'ఈనాడు' రాగానే మా అబ్బాయి మెయిన్ ఎడిషన్ తను తీసుకొని, 'మమ్మీ.. నీ పేజ్ ఇదిగో..' అంటూ 'వసుంధర' పేజీని నాకు ఇస్తే.. అపురూపంగా 'వసుంధర'ను అందుకొని ఒక్క పదాన్ని కూడా వదలకుండా చదివేసి; స్ఫూర్తిదాయకమైన విషయాలను ఎవరికి అవసరమో వాళ్లకు చెబుతుంటాను. 'ముత్యాల ముగ్గుల్లో నా పాత్రా ఉంది' అని ఇప్పటికీ గర్వంగా చెప్పుకుంటాను!
Surya Prabha sana
Hi Vasundhara, Madi o chinna palle. Ooha telisi padalu nerchukunna daggara nundi naku Vasundhara tho Anubandham. Ma amma garu Vasundhara lo vachhe Kutlu- allikalu, Najarana, Vantalu.. roju cut chesi file chesukone varu. Avi nenu kooda kalee samayallo baga chadivedanni. Lestune Daddy ki paper istoo amma, nenu Vasundhara paper kosam potee padevallam. Madi village ayinaa.. nenu fashionable ga tayaravuta.. daniki karanam Vasundhara! Yela Antara? Fashion-Fashion perutho vachhe articles Anni follow ayyedanni. Alane hairstyles kooda step by steps pics pettevallu. Nakepuddu anipinchedi.. ilane tailoring cutouts kooda pedite bavunnani. Inka marenno sphoortidayakamaina kathanalatho.. ammayi ante ela dhairyamga undalo cheppevaru. With Real stories! Naku chala saarlu anipinchedi.. telugu ammai ga puttadam valla ee paper chadavagalgutunna ani! Alane na pillala pics kooda ‘LITTLE KRISHNA’ competition ki pampi murisipoyedanni. Ipudu memu Mumbai lo untunnam.. ayina online lo Eenadu e-paper chaduvutanu. Thank you Ramoji Rao garu. Entha social media abhivruddhi chendina.. pustaka pathanam anedi oka santoshanni istundi. Inka ladies ki upayogapadela abhivruddhi chestarani aasistunnanu. Thank you Eenadu team!
Swarna
రామోజీరావు గారి లాగానే అందరికీ ఉపయోగపడేలా, స్ఫూర్తిని ఇచ్చేలా ఉంటుంది ‘వసుంధర’..! వసుంధరతో మా అనుబంధం చాలా సుదీర్ఘమైనదే అని చెప్పాలి. ‘ఈనాడు’కి, రామోజీ ఫిల్మ్ సిటీకి, మా కుటుంబానికి విడదీయరాని అనుబంధం వుంది అని చెప్పాలి. నాకు 7 ఏళ్ళు వున్నప్పుడు అంటే 1997లో మా నాన్నగారు ఫిల్మ్ సిటీలో ఉద్యోగ రీత్యా హైదరాబాద్ తీసుకొచ్చారు. అప్పటి నుండి ఇప్పటివరకు ఫిల్మ్ సిటీ కుటుంబంలో మేము కూడా భాగమే అనుకుంటాం..! ఎందుకంటే మా నాన్న ఉద్యోగంలో చేరిన రెండేళ్లకు మా అమ్మ కూడా ఫిల్మ్ సిటీలోనే చిన్న ఉద్యోగంలో చేరింది... 2008లో నాన్న ఉద్యోగం చేస్తూనే కిడ్నీ ఫెయిల్యూర్ తో 3 నెలలు మంచాన పడి చనిపోయారు. అప్పటి నుండి ఇంటి బాధ్యత అమ్మదే అయింది. చెల్లి పెళ్ళి.. ఆ తర్వాతి బాధ్యతలన్నీ అమ్మే చూసుకుంది. ప్రస్తుతం అమ్మ రొమ్ము క్యాన్సర్ నుండి ప్రాణాలతో బయటపడింది... ఇలా ఎన్నో క్లిష్ట పరిస్థితులలో ఫిల్మ్ సిటీ ప్రత్యక్షంగానో పరోక్షంగానో సహాయం చేస్తూనే ఉంది! మాలాంటి కుటుంబాలెన్నో రామోజీరావు గారి మానవత్వానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఇక 'వసుంధర'తో ఇంకో అనుభవం మీతో పంచుకోవాలి.. 17 ఏళ్ళ క్రితం మాకు తెలిసిన ఒక ఆవిడ బ్రెస్ట్ క్యాన్సర్ నుంచి బయటపడింది. ఆమె భర్తని ఆమె ఆరోగ్యం గురించి ఆరా తీస్తూ ఇలా అడిగాను.. 'అంకుల్.. మీరు ఇంత త్వరగా ఈ వ్యాధిని ఎలా గుర్తించారు'?అని. దానికి సమాధానంగా ఆయన.. ‘ఆ మధ్య 'ఈనాడు వసుంధర'లో క్యాన్సర్, దాని లక్షణాలు.. చికిత్స విధానం.. ప్రాథమిక దశలోనే ఎలా గుర్తించాలి.. ఇలాంటి విషయాలు ప్రచారించారు. మీ ఆంటీ చదివి నాతో చదివించింది.. కొన్ని రోజుల తరువాత అవే లక్షణాలు ఆవిడలో కనిపించాయి. వెంటనే పరీక్షలు చేయించాం.. వ్యాధి నిర్ధారణ అయింది. ప్రాథమిక దశలో వుంది అని డాక్టర్ చెప్పారు..’ అని నాతో ఆయన అనుభవాలను పంచుకోవడం జరిగింది. ఆవిడ అలా క్యాన్సర్ నుంచి బయటపడింది! అంతేకాకుండా.. ‘వసుంధర’లో ప్రచురించే కథనాలు వ్యక్తిగతంగా కూడా నాలో చాలా స్ఫూర్తిని నింపాయి.. ఎలా అంటే నాకు 10వ తరగతి అయిపోగానే 16 ఏళ్ళకే పెళ్ళి చేసి పంపించారు.. ఆ తరవాత చోటు చేసుకున్న కొన్ని పరిణామాలు నేను బతకడమే గొప్ప అనుకునేలా చేశాయి. అలాంటి పరిస్థితుల్లో కొన్ని ‘వసుంధర’ కథనాలు నాలో ఎనలేని స్ఫూర్తిని నింపాయి.. పెళ్ళి అయిన ౫ ఏళ్ళకి డిగ్రీ పూర్తి చేసి, నర్సరీ టీచర్ గా నా జీవితాన్ని తిరిగి మొదలు పెట్టి, ఇప్పుడు పదో తరగతి సోషల్ టీచర్ గా ౨౫,000 జీతం అందుకునే స్థాయికి వచ్చాను.. ఇదంతా రామోజీరావు గారి మానవత్వం, దార్శనికత; ‘ఈనాడు వసుంధర’ అందించిన స్ఫూర్తి వల్లే సాధ్యం అయ్యాయి!
Sirisha Ganta
Eenadu lo vasundhara kosam choostamu.. women ki spoortinichhe enno amsaalu vuntayi.
Vani prasanna
‘ఈనాడు వసుంధర’ చదవడం నాకు చాలా ఇష్టం. ఎన్నో రంగాల్లో విజయం సాధించిన మహిళల కథలు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. పలు సందర్భాల్లో ఓదార్పును, స్ఫూర్తిని పొందాను. సంక్రాంతికి వచ్చే రంగవల్లికలు, వంటలు కట్ చేసుకుని ఇప్పటికీ పదిలంగా దాచుకుంటాను. సౌందర్య చిట్కాలు, ఆరోగ్య సూచనలు చాలా బాగుంటాయి. ఖతార్ లో ఉండడం వల్ల ఇప్పుడు ఆన్లైన్ లో చదివి ఆనందిస్తున్నాను. అలాగే ‘ఆదివారం అనుబంధం’లో వచ్చే కథలు తప్పకుండా చదువుతాను. మాకు స్ఫూర్తినిచ్చే ఎన్నో కథనాలను అందించిన స్వర్గీయ రామోజీ రావు గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు, నమస్సుమాంజలి!🙏🙏
సత్య కళ
వ్యాపారవేత్తలుగా రాణించే పలువురు మహిళల గురించి 'వసుంధర'లో వచ్చే కథనాలు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటాయి.
Madhu Priya Potturi
‘ఈనాడు వసుంధర’లో ఎందరో స్ఫూర్తిదాయకమైన మహిళల గురించి చదివాను. ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చుకున్న ఎందరో నాకు ఆదర్శం. సౌందర్య చిట్కాలు, వంటింటి చిట్కాలు, నజరానా బాగుంటాయి. సంక్రాంతి పండగ సమయంలో రంగవల్లికలు కట్ చేసి దాచుకున్నవి ఎన్నో ఉన్నాయి. ‘వసుంధర’ అంటే కేవలం పత్రిక కాదు.. మహిళల సామ్రాజ్యం. భవిష్యత్ కి భరోసా దొరుకుతుంది. బాధలో ఉన్నప్పుడు ఓదార్పునిస్తుంది. వంటింటి నుండి ఒంటి చేత్తో ఆకాశాన్ని అందుకునేంతటి శక్తి నారీమణులకి ఇచ్చిన ‘వసుంధర’ ఎప్పటికీ మాకు ఇష్టం. ఇంకా ఎన్నో ఉన్నతమైన కథనాలు ప్రచురిస్తూ మమ్మల్ని ఎప్పటికీ ఇలానే ఉత్తేజపర్చాలని కోరుకుంటున్నాం..
కల్పన
From 1977, I know about EENADU News paper. Even if I am out of station, after going back, I will read all the pending editions. I AM VERY MUCH PROUD OF EENADU NEWS PAPER AND VASUNDHARA EXPERT ANSWERS (DEAR VASUNDHARA).
AMARAPALLI VASANTHI
నేను దాదాపు 14 సంవత్సరాలుగా ఆన్‌లైన్‌లో ప్రతిరోజూ ఈనాడు చదువుతుంటాను. WHY BECAUSE I AM WORKING OUT SIDE OF THE COUNTRY. వసుంధర పేజీలో వచ్చే కథనాలు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. పలు సందర్భాల్లో ఆ కథనాల వల్ల నేను కూడా స్ఫూర్తి పొందాను.
Anilkumar bantu
I have been reading Eenadu Vasundhara since I was 12 years old. I especially appreciate articles about women's equal rights in family finances and legal advice. I have also learned and followed health tips. I am deeply grateful to Mr. Ramoji Rao for his valuable contribution to women's wellness.
Heleena Veera
జీవితంలో వేసే ప్రతి అడుగులో ఎన్నో ప్రశ్నలు ఎదురవుతుంటాయి. వసుంధర ద్వారా చాలా వాటికి సమాధానాలు దొరికాయి. ప్రతి అమ్మాయికి వసుంధర ఒక మార్గదర్శి.
Sailaja
The most inspirational page for women is Vasundhara! Women entrepreneurs stories, business ideas, chadivite manam kuda Edo okati cheyyalanipistundi. Kastakalam lo ela batakavacho telusukovachu. Samajam lo ela batakalo telusukunna. Manchi mata inspirational quotes chala upayogam ga unnayi. Thank you. Thank you Ramoji Rao sir for being an inspiration for all of us through your publications. May your soul rest in peace sir!
Dhanasree
My name is Padma. Last 24 years I have been living in the USA however I am busy at work. Without reading the Eenadu paper and Vasundhara page my day won't end.
padmavathi mamillapalli
Bagundi
M.prathapnaidu
మేము ఇక్కడ ఖతార్ దేశంలో ఉండటం వల్ల వార్తా పత్రికలు చదివే వెసులుబాటు లేదు. అందుకని ఆన్లైన్ లో ప్రతిరోజూ ‘ఈనాడు’ చదువుతాను. ‘వసుంధర’ కూడా తప్పకుండా చదువుతాను. 'వసుంధర'లో ప్రతికూలతలను ఎదిరించి.. విజయతీరాలకు చేరుకుంటున్న మహిళల గురించి చదివి స్ఫూర్తి పొందుతుంటాను. పేరెంటింగ్, ఆరోగ్య చిట్కాలు, సౌందర్య చిట్కాలు, వంటలు అన్ని అంశాలు చాలా బాగుంటాయి. ఇదేవిధంగా ‘ఆదివారం అనుబంధం’లో కథను కూడా కచ్చితంగా వదిలిపెట్టను.
Madhavi Bytaru

మరిన్ని ప్రశ్నలు

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్