క్రీడాకారిణులపై లైంగిక వేధింపులు.. ఈ దుస్థితికి కారణాలేమిటి? ఇలాంటివాటిని ఎలా ఎదుర్కోవాలి? నిందితులకు ఎలా బుద్ధి చెప్పాలి?

Published : 24 Apr 2023 20:15 IST

మీ సమాధానం

పాఠకుల కామెంట్స్

పాపం ఆఖరికి మన దేశానికి పతకాలు తెచ్చిన క్రీడాకారులకు కూడా వేధింపులు తప్పడం లేదు. రాను రాను మరింత దిగజారిపోయే పరిస్థితికి వచ్చింది. మన దేశ గౌరవానికి కూడా ఇది మంచిది కాదు. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఎవరైతే వేధింపులకు పాల్పడ్డారో వారిని పౌర సమాజానికి తెలిసేలా కఠినంగా శిక్షించాలి. అప్పుడు మిగతా వారికి పరువు పోతుందేమోనన్న భయం ఉంటుంది. ప్రభుత్వం ఈ అంశాన్ని కఠినంగా తీసుకోవాలి. ఇంత దారుణం జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుందో అర్థం కావడం లేదు.
Jaanu
fast adapilalu daryam gaa vuntunaru kanni kothamandhi ade alusugaa thisukoni valla tho bad behavear chesthunaru alanti valani vadhalakodadhu girls koda jagarthagaa vundali okaru mana voipu chuse chupe thelisipothadi vadu good gaa chusthunada leka bad gaa chusthunada anni munde alect gaa ooundali munde thelusu kunte jagarthagaa vadi poina complent evachu
sujatha
The organizations should be headed by prominent persons in the respective fields and equal number of women representation must be there in the respective committees.
Sony
క్రీడాకారిణులపై లైంగిక వేధింపులు అనేది సిగ్గు పడాల్సిన విషయం. ఇటువంటివి మహిళలను మరింత కుంగదీస్తాయి. మహిళలు చాలా రంగాల్లో వీటిని ఎదుర్కొంటున్నారు. పేద, వెనకబడిన కుటుంబాల నుంచి వచ్చే అమ్మాయిలు ఇటువంటి పరిస్థితుల్ని చూసి, వారు భయాందోళనలకు గురి అయ్యే అవకాశం ఉంది. ఈరోజు ప్రపంచంలో భారత దేశానికి మంచి గుర్తింపు ఉంది. కాబట్టి ప్రభుత్వం ఇటువంటివి జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలి.
Vaheda Sulthana
All potential players of any game/sport should have same gender mentor (don’t ignore homosexual coaches). Coach can be Male or female. At outset all players to be briefed about procedure to deal with sexual harassment and a signature that they are briefed. Procedure in place need to include anonymous complaint option to higher authorities which need to be investigated immediately if they receive any. Escalation matrix of complaint from players to be displayed in all areas of practice and stay. Encourage players to inform their parents and take their help of any unwanted sexual advances as needed. Assurance of confidentiality a must for all the players in case of complaint.
Dr Ravi
First everyone should know their own right. Then some laws related to harrassment and rules how to give compliant and way to approach to proper way. Importantly everyone must and should know self protection tips.
Sri Usha G
రెజ్లింగ్ క్రీడలో దేశానికి ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు తెస్తున్న క్రీడాకారిణులు ఇలా రోడ్డుపైకి వచ్చి తమకు జరిగిన అన్యాయంపై పోరాడడం న్యాయమైనదే. మన దేశంలో వీరికే ఇలా జరిగితే ఇక సామాన్యుల పరిస్థితి ఇంకా ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. నేరం చేసిన వారిని ఇలా స్వేచ్ఛగా వదిలేస్తే ఎలా? అధికార పార్టీ అండదండలు ఉన్నాయనే ధైర్యమా? అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇటువంటి చర్యలకు పాల్పడేవారిని కఠినంగా శిక్షించాల్సి ఉంది. చట్టాలను మార్చాలి. ఎంతలా అంటే... వేసే శిక్షను చూసి మరొకరు ఇలాంటి పనులకు పాల్పడకుండా ఉండాలి. మహిళలకు సరైన రక్షణ చర్యలు చేపట్టేలా న్యాయ వ్యవస్థ కల్పించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. అధికార పార్టీకి చెందిన వారైతే తప్పులు చేయాలని ఎక్కడా లేదు. తప్పు తప్పే. ఆ తప్పును సమర్ధించడం మరింత పెద్ద తప్పు.
Challa Subrahmanyam
క్రీడాకారిణులపై లైంగిక వేధింపులకు ప్రధాన కారణం సరైన ప్రభుత్వ పర్యవేక్షణ లేకపోవడం. ముఖ్యంగా మహిళా క్రీడాకారులకు మహిళలే కోచ్ గా లేకపోవడం. ఆర్థికంగా వెనకబాటుతనం కూడా లైంగిక వేధింపులకు కారణం కావచ్చు. దీనికి క్రీడాకారిణుల మధ్య యూనిటీ అవసరం. ఎవరి సమస్య అయినా అందరూ ఒకేలా స్పందించాలి . ఆరోపణ వచ్చినప్పుడు తక్షణ యాక్షన్ ఉండాలి . కోచ్ ఆధారిత నిర్ణయం కాకుండా ప్రత్యేక నిపుణుల పర్యవేక్షణలో క్రీడాకారుల నైపుణ్యాలను గుర్తించి వాళ్లకు సరైన సహకారం అందిస్తే వాళ్ళు ఎదుటివారి సహకారం (కోచ్ ,సెలక్టర్లు) మీద డిపెండ్ అవ్వరు. కాబట్టి ,ఏదైనా సమస్య ఉన్నప్పుడు వాళ్ళు నిర్భయంగా బయటకు మాట్లాడగలరు. తమకి తాముగా డెవలప్ అవ్వగలరు . కాబట్టి సెలక్షన్, కోచింగ్ అంతా ఒక్కరిచేతుల్లోనే ఉండకూడదు.
RAJU VANNEM

మరిన్ని ప్రశ్నలు

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్