ఈమధ్య విదేశాల్లో చదువుకునే మన యువతకు భద్రత లేకుండా పోయింది. ముఖ్యంగా అమ్మాయిలూ భద్రత విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తెలిసిన వాళ్ల ఫోన్ నంబర్లు, స్నేహితుల ఫోన్ నంబర్లు అందుబాటులో ఉంచుకోవాలి. స్కాలర్షిప్లు తీసుకుని సరైన యూనివర్సిటీ ఎంచుకుని వెళ్తే ఏ సమస్యా ఉండదు. అక్కడికి వెళ్లిన తర్వాత కూడా ఒంటరిగా ఉండకుండా స్నేహితులతో కలిసి ఉంటే మంచిది. తెలిసిన వాళ్ల దగ్గర ఉంటే మరీ మంచిది. ఏదైనా సమస్య వస్తే స్నేహితులతో మాట్లాడండి. వారి సహాయం తీసుకోండి. ఇండియన్ ఎంబసిని కాంటాక్ట్ అవ్వండి.
JANAKI