సంక్రాంతి పండగ జరుపుకోవడంలో మీ చిన్నప్పటికీ ఇప్పటికీ ఏవైనా మార్పులు చోటుచేసుకున్నాయా? ఈసారి మీ వేడుకల గురించి పంచుకోండి..

Published : 13 Jan 2024 14:41 IST

మీ సమాధానం

పాఠకుల కామెంట్స్

Maadi Srikakulam district in AP. Memu hyderabad lo untunnamu. Chinnappati nundi complete family tho sankranti pandaga celebrate chesukune vallamu. Ee year vellalani unna , tickets dorakaka Hyderabad lone undipoyamu. chala velitiga anipinchindi. Sankranti pandaga mana vallatho, enta ekkuva manditho aite anta ekkuva manditho celebrate chesukunte bagundtundi
Krishna
మాది ఉమ్మడి కుటుంబం. మేము చిన్నప్పుడు చాలా బాగా పండగ జరుపుకొనేవాళ్లం. అందరం కలిసి భోగి మంట వేసేవాళ్లం. పిండి వంటలు వండుకునేవాళ్లం. సంక్రాంతి పండగ రోజు పెద్ద పెద్ద ముగ్గులు వేసేవాళ్లం. కనుమ రోజు గాలి పటాలు ఎగుర వేసేవాళ్లం. అందరం కొత్త బట్టలు వేసుకొని, నగలు ధరించి ముస్తాబయ్యేవాళ్లం. ఇప్పుడు జాబ్స్ చేయడం వల్ల అందరం సిటీస్‌కి వచ్చేశాం. మాలో కొంతమంది హైదరాబాద్‌, ముంబయి, అమెరికాలో ఉంటున్నారు. కానీ ప్రతి 2 లేదా 3 సంవత్సరాలకోసారి అందరం కలిసి సంక్రాంతిని సరదాగా సెలబ్రేట్‌ చేసుకుంటున్నాం.
కంచర్ల భాగ్యలక్ష్మి
Yes more changes
b.suresh
ముందుగా అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం వచ్చే ఈ పండుగ కళను నేను మాత్రం నా చిన్నప్పటి జ్ఞాపకాలతో ఎప్పుడూ ఆనందిస్తుంటాను. అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలతో గడిపిన ఆ రోజుల్లో జరుపుకున్న పండుగ ఎంతో బాగుంది. ప్రస్తుతం అంతా హడావిడి ప్రయాణంలా ఉంది.
Divija
చాలా ఉన్నాయి. సంక్రాంతి అంటే భోగిమంటలు, గొబ్బిళ్ళు, పిండి వంటలు మాత్రమే కాదు పతంగుల పండుగ కూడా. రంగు రంగుల పతంగులు ఎగురవేస్తూ ఉంటే.. వారేవ్వా ఆ అనుభూతే వేరు. ఇప్పుడు పరిస్థితులు చాలా మారాయి. ఐనా పండుగను ఘనంగా జరుపుకుంటాము.
రాజన్న రాళ్లబండి

మరిన్ని ప్రశ్నలు

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్