Published : 24/04/2021 00:54 IST

పాప పండ్లు తిననంటోంది!

మా పాప వయసు నాలుగేళ్లు. కొన్ని రకాల ఆహార పదార్థాలను అస్సలు తినడం లేదు. ముఖ్యంగా పండ్లు చూస్తే పారిపోతుంది. తీపి ముట్టుకోదు. అన్నం కూడా మెల్లగా తింటోంది. తను వీటన్నింటిని ఇష్టంగా తినాలంటే నేనేం చేయాలి?

- అను, వరంగల్‌

సాధారణంగా చిన్నారులకు కొత్త రుచుల పరిచయం ఏడాది లోపు నుంచే మొదలుపెట్టాలి. కుటుంబ సభ్యులు, ఇంటి వాతావరణం బట్టే పిల్లల అలవాట్లు ఆధారపడి ఉంటాయి. కాబట్టి మీరు తన ముందు తినడం మొదలు పెట్టండి. అప్పుడు మిమ్మల్ని చూసి తను కూడా తింటుంది.  
ఆకర్షణీయంగా...
కంటికింపుగా కనిపించే పదార్థాలను పిల్లలు ఇష్టపడతారు. అందువల్ల పండ్ల ముక్కలను రకరకాల ఆకారాల్లో కోసి, అందమైన గిన్నెలు, ట్రేలలో ఆకర్షణీయంగా అమర్చి ఇవ్వండి. మిల్క్‌ షేక్స్‌, స్మూథీ, పండ్లరసాలను తనకిష్టమైన బొమ్మల గిన్నెలు, గ్లాసుల్లో పోసి తాగించండి. ఓ పండుని తీసుకుంటే... గుజ్జు, ముక్కలు, జ్యూస్‌... ఇలా ఒక్కోరకంగా చేసి  ఇవ్వొచ్చు. కనీసం పది, పదిహేను రకాల పండ్లను రుచి చూపిస్తే కనీసం ఐదారైనా చిన్నారి అలవాటు చేసుకుంటుంది.
కొద్దిమొత్తంలో..
చిన్నారుల పొట్ట చాలా చిన్నది. అందులో పట్టేంత పదార్థాలనే పెట్టాలి తప్ప గిన్నె, గ్లాసు మొత్తం అయిపోవాల్సిందే అని వారిని బలవంతం చేయొద్దు. ఈ విషయం ప్రతి అమ్మా గుర్తుపెట్టుకోవాలి. పిల్లలకు 50 నుంచి 100 ఎం.ఎల్‌.పండ్ల రసం సరిపోతుంది. అలాగే గుప్పెడు ముక్కలు (కనీసం100 గ్రా.) తిన్నా పొట్ట నిండుతుంది. పండ్ల రంగు, రుచులతోపాటు వాటిని తినడం వల్ల కలిగే లాభాలనూ వారికి వివరించాలి. అప్పుడే తినడానికి ఇష్టపడతారు. అరటి, యాపిల్‌, మామిడి పండ్ల నుంచి ఎక్కువ కెలొరీలు వస్తాయి. కాబట్టి వాటిని అన్నం తినేముందు, తిన్న వెంటనే కాకుండా... మధ్యమధ్యలో ఆడుకుని వచ్చాక, పెట్టాలి. పండ్లలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, పీచు, పోషకాలు బోలెడు ఉంటాయి.  
మరో మాట...
చిన్నారి స్వీట్సు తినడం లేదని బాధపడొద్దు. అది సమస్య కానేకాదు. అదే సమయంలో కారంగా ఉండే చిప్స్‌, మిక్చర్‌, ఫ్రెంచ్‌ ఫ్రైస్‌ లాంటివి తింటుందా గమనించండి. వీటిలో కెలొరీలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి తింటుంటే ఆకలి కాకపోవచ్చు. అలాగే పాపకు మూడు పూటలా అన్నమే పెట్టాలనేమీ లేదు. చపాతీ, దోసె, ఇడ్లీ... వంటివీ పెట్టొచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి