మెరిపించే బొప్పాయి!

బొప్పాయి తింటే పోషకాలు లభించి ఆరోగ్యంగా ఉంటాం. అలాగే ఇది జుట్టుకీ మేలు చేస్తుంది. జుట్టు రాలడాన్ని తగ్గించి, చిట్లిన కేశాలకు పోషణనిచ్చి ఒత్తుగా పెరిగేలా చేస్తుంది.

Published : 18 May 2021 00:19 IST

బొప్పాయి తింటే పోషకాలు లభించి ఆరోగ్యంగా ఉంటాం. అలాగే ఇది జుట్టుకీ మేలు చేస్తుంది. జుట్టు రాలడాన్ని తగ్గించి, చిట్లిన కేశాలకు పోషణనిచ్చి ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. మరి ఆ పూతలు ఎలా వేసుకోవాలో చూద్దామా...

సెనగపిండి, పెరుగుతో...
మొదట కప్పు ముక్కలను మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి. దీంట్లో మూడు చెంచాల పెరుగు, రెండు చెంచాల సెనగపిండి కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు పట్టించి. షవర్‌ క్యాప్‌ పెట్టుకోవాలి. అరగంట తర్వాత గాఢత తక్కువగా ఉండే షాంపుతో కడిగేయాలి. పదిహేను రోజులకోసారి ఈ పూత వేసుకుంటే మీ జుట్టు ఆరోగ్యంగా, దృఢంగా మారుతుంది.

ఆలివ్‌ నూనెతో...
నాలుగు చెంచాల బొప్పాయి గుజ్జులో రెండు చెంచాల ఆలివ్‌ నూనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించాలి. మాడుపై రాసి మృదువుగా మర్దనా చేయాలి. ఓ గంటపాటు జుట్టును అలానే వదిలేయాలి. ఆ తర్వాత మైల్డ్‌ షాంపుతో కడిగేస్తే సరి. వారంలో ఒకసారి దీన్ని ప్రయత్నించండి. ఈ పూత వల్ల జుట్టుకు పోషణతోపాటు మెరుపూ సొంతమవుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్