బ్రేకింగ్

breaking

వివేకా హత్య కేసు.. ఆ ఐదుగురికి CBI కోర్టు సమన్లు

[13:59]

హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ హైదరాబాద్‌ సీబీఐ కోర్టులో ప్రారంభమైంది. ఈ కేసులో ప్రధాన, అనుబంధ ఛార్జిషీట్‌లను సీబీఐ కోర్టు విచారణకు స్వీకరించింది. వివేకా హత్య కేసుకు ఎస్‌సీ/01/2023 నంబర్‌ కేటాయించింది. కేసుకు సంబంధించిన నిందితులు ఎర్ర గంగిరెడ్డి, సునీల్‌, ఉమాశంకర్‌, దస్తగిరి, శివశంకర్‌ రెడ్డికి సమన్లు జారీ చేసింది. ఫిబ్రవరి 10న విచారణకు రావాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో కడప నుంచి హైదరాబాద్‌ సీబీఐ కోర్టుకు కేసు బదిలీ అయిన విషయం తెలిసిందే. 

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని