Updated : 26/01/2022 05:21 IST

బుజ్జిగా.. అందంగా!

ప్రయాణాలు చేయాలి.. చర్మసంరక్షణ ఉత్పత్తులను తప్పక తీసుకెళ్లాల్సిందే. పెళ్లిళ్లు, ఫంక్షన్లకు మేకప్‌ సామగ్రి తప్పనిసరి. హ్యాండ్‌బ్యాగ్‌లో స్థలమంతా ఇవే ఆక్రమించేస్తాయి. అందరూ వాడేవే అయినా బయటకు తీసేటపుడు ఒకరకమైన మొహమాటం. వీటి నుంచి తప్పించడానికి వచ్చివనే ఈ మినీ కిట్‌లు. స్కిన్‌ కేర్‌, మేకప్‌.. ఏవైనా బుజ్జి పరిమాణాల్లో ఉంటాయి వీటిలో. స్థలమూ ఆక్రమించవు, తీసుకెళ్లడమూ సులువే. భలే ఆలోచన కదూ! చూడటానికీ ముచ్చటైన రూపాల్లో లభిస్తున్నాయి. మీకు కావాల్సినవేంటో.. తెచ్చేసుకోవడమే తరువాయి!


Advertisement

మరిన్ని