వేపతో మెరుపు!

అందరికీ అందుబాటులో ఉండే... ఔషధాల గని వేప. ఈ ఆకులను ఉపయోగించి చర్మాన్నీ, జుట్టునీ సంరక్షించుకోవచ్చు. అదెలాగంటే...

Updated : 26 Dec 2022 06:39 IST

అందరికీ అందుబాటులో ఉండే... ఔషధాల గని వేప. ఈ ఆకులను ఉపయోగించి చర్మాన్నీ, జుట్టునీ సంరక్షించుకోవచ్చు. అదెలాగంటే...

* వేపలో విటమిన్‌-ఎ, సి, కెరొటినాయిడ్స్‌, లినోలియిక్‌, ఒలియిక్‌ లాంటి సమ్మేళనాలు చర్మానికి కావాల్సిన పోషణను అందిస్తాయి. నాలుగైదు వేప ఆకులను నూరి, దానికి కాస్త పెరుగూ, చెంచా చొప్పున నువ్వుల నూనె, పెసరపిండి వేసి పేస్ట్‌లా చేయాలి. దీన్ని ఒంటికి రాసి నలుగులా రుద్దండి. మొటిమలూ, మచ్చలూ తగ్గి చర్మం కోమలంగా మారుతుంది.

* వేపలోని యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ, యాంటీబయోటిక్‌, యాంటీ ఆక్సిడెంట్‌ సమ్మేళనాలు జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. వేపనీటితో వెంట్రుకలను శుభ్రం చేసుకుంటుంటే.. చుండ్రు పట్టడం, రాలడం వంటి సమస్యలు అదుపులో ఉంటాయి. ఇందుకోసం గుప్పెడు చొప్పున వేప, మందార ఆకులను ఎంచుకుని వాటిని కడిగి నీడన ఆరబెట్టాలి. దానికి నానబెట్టి రుబ్బిన పావుకప్పు మెంతిపిండిని చేర్చి తలకు రాసుకుని ఆరాక కడిగేస్తే చాలు. ఇలా నెలకో రెండు సార్లు చేసినా మేలే.

* వేపాకుని ముద్దగా నూరి, దానికి కాస్త కొబ్బరి తురుమూ, చెంచా పసుపు చేర్చి ఒంటికి రాసుకుని రుద్దుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం శుభ్రపడటమే కాదు...కళగానూ మెరిసిపోతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్