తల పలుచనవుతోందా..
ఎంతో ప్రేమగా చూసుకునే కురులు రాలుతోంటే మనసుకి చాలా బాధేస్తుంది కదూ! వాతావరణ మార్పులు, అప్పుడప్పుడు పలకరించే అనారోగ్యాలు, మారుతున్న జీవనశైలి.. ప్రభావాలన్నీ పడేది మరి దానిపైనే.
ఎంతో ప్రేమగా చూసుకునే కురులు రాలుతోంటే మనసుకి చాలా బాధేస్తుంది కదూ! వాతావరణ మార్పులు, అప్పుడప్పుడు పలకరించే అనారోగ్యాలు, మారుతున్న జీవనశైలి.. ప్రభావాలన్నీ పడేది మరి దానిపైనే. బయట పడాలా.. ఈ చిట్కాలు పాటిస్తే సరి!
- అప్పుడే తీసిన తాజా కలబంద గుజ్జును జుట్టుకి పట్టించాలి. గంటయ్యాక గాఢత తక్కువున్న షాంపూతో తలస్నానం చేస్తే సరి. మాడు పొడిబారడం, చుండ్రు, ఇన్ఫెక్షన్లు కురులు రాలడానికి కారణమవుతోంటే.. ఆ సమస్యలన్నింటినీ ఇది దూరం చేస్తుంది. కుదుళ్లను బలంగా మార్చి జుట్టు ఆరోగ్యంగా పెరిగేలా చేయడమే కాదు.. చిక్కులు పడనివ్వదు.
- ఒక పెద్ద ఉల్లిపాయను మిక్సీ పట్టి, రసం వడకట్టాలి. ఆపై దాన్ని మాడుకి పట్టించి, పావుగంటయ్యాక గోరువెచ్చని నీటితో తలస్నానం చేయండి. దీనిలో ఉండే సల్ఫర్ కుదుళ్లను ఆరోగ్యవంతం చేసి, కురులు వేగంగా పెరిగేలా సాయపడుతుంది.
- మనసును ఇట్టే మార్చేయగల శక్తి ఉన్న ఎసెన్షియల్ నూనెలు జుట్టు పెరుగుదలలోనూ సాయపడతాయి. రోజ్‌మెరీ, లావెండర్, పెప్పర్‌మింట్‌ల్లో నచ్చిన దాన్ని ఎంచుకొని గోరువెచ్చని కొబ్బరినూనెలో కొన్ని చుక్కలు కలిపి తలకు పట్టించండి. గంటయ్యాక తలస్నానం చేస్తే చాలు. వీటిల్లోని యాంటీ మైక్రోబియల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మాడుని ఆరోగ్యంగా ఉంచుతాయి.
- వీటితోపాటు తరచూ తలను మర్దనా చేయడం, మృదువుగా దువ్వడం వంటివి చేయాలి. ఒత్తిడి, హీటింగ్ ట్రీట్‌మెంట్లు, రసాయన ఉత్పత్తులకు దూరంగా ఉంటే కురులు రాలడం తగ్గుతుంది. అయితే పైపై పూతలే కాదు.. లోపల్నుంచీ పోషణ కావాలి. అందుకుగానూ ఆరోగ్యకరమైన ఆహారానికీ ప్రాధాన్యమివ్వాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.