ఏది ముఖ్యమైతే అదే
ఇంట్లో సరకులు కొనే ముందు మన దగ్గర ఏముంది, ఏంలేదు అని నిశితంగా పరిశీలించి కొనుక్కునే మహిళలు.. మేకప్ సామాన్ల దగ్గరకు వచ్చేటప్పటికి వీటన్నిటిని పక్కకు నెట్టెస్తుంటారు.
ఇంట్లో సరకులు కొనే ముందు మన దగ్గర ఏముంది, ఏంలేదు అని నిశితంగా పరిశీలించి కొనుక్కునే మహిళలు.. మేకప్ సామాన్ల దగ్గరకు వచ్చేటప్పటికి వీటన్నిటిని పక్కకు నెట్టెస్తుంటారు. కొత్త ఉత్పత్తి బాగుందనో, డిస్కౌంటు ఉందనో ఒకటికి రెండు కొనేస్తుంటారు. అలా కాకుండా ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుని స్టోర్‌కి వెళితే డబ్బు, సమయం రెండూ ఆదా అవుతాయి అంటున్నారు నిపుణులు.
- మాయిశ్చరైజర్ లేకుండా మేకప్ మొదలవదు. కాబట్టి ముందుగా అవసరం మేరకు దీన్నే తీసుకోవాలి. నచ్చిన లేదా మీ చర్మానికి సరిపడే బ్రాండ్‌లను ఎంచుకోండి.
- చర్మం మీద రంధ్రాలు ఎక్కువగా ఉంటే వాటిని కవర్ చేసుకోవడానికి ప్రైమర్‌ను వినియోగిస్తుంటారు. మాయిశ్చరైజర్ తర్వాత ప్రాధాన్యత దీనికి ఇవ్వాలి.
- లిప్‌స్టిక్‌లను బ్రాండ్, కొత్తరకం అనికాకుండా మనం వేసుకునే రంగులకే ప్రాధాన్యమివ్వాలి.
- మార్కెట్లో ట్రెండ్స్‌కి అనుగుణంగా రకరకాల కాటుకలు తెచ్చిపెడుతున్నారు. వాటర్ ప్రూఫ్ పేరుతో విక్రయాలు చేస్తున్నారు. వాటిలో చాలా బ్రాండ్‌లు రాసుకోవడం వల్ల కళ్లు పొడారుతుంటాయి. దీనివల్ల డ్రైనెస్ సమస్యలు వస్తుంటాయి. అలా కాకుండా మీరు ఎప్పుడు వాడే వాటినే ఎంపిక చేసుకోండి. ఇలా బ్లష్‌లు, ఐషాడోలు, లిప్‌లైనర్లు లాంటి మేకప్ వస్తువులను కొనేటప్పుడు ప్రణాళికాబద్ధంగా ఉంటే ఇక్కడా పొదుపు సాధ్యమవుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.