డబుల్‌ క్లెన్సింగ్‌... చేస్తున్నారా?

చర్మ సమస్య ఏదైనా చాలాసార్లు ‘డబుల్‌ క్లెన్సింగ్‌ తప్పనిసరి’ అన్న సలహా వినిపిస్తుంది. అంటే ఏంటి? రెండుసార్లు చర్మాన్ని శుభ్రం చేసుకోవడం అనేస్తారా? ఒకరకంగా నిజమే కానీ... దానికీ ఓ పద్ధతి ఉందని తెలుసా?

Published : 21 Mar 2024 02:06 IST

చర్మ సమస్య ఏదైనా చాలాసార్లు ‘డబుల్‌ క్లెన్సింగ్‌ తప్పనిసరి’ అన్న సలహా వినిపిస్తుంది. అంటే ఏంటి? రెండుసార్లు చర్మాన్ని శుభ్రం చేసుకోవడం అనేస్తారా? ఒకరకంగా నిజమే కానీ... దానికీ ఓ పద్ధతి ఉందని తెలుసా? అదేమిటంటే...

  • నచ్చిన సబ్బు, ఫేస్‌వాష్‌తో ముఖం కడిగేయడం చాలామంది అనుసరించే పద్ధతి ఇదే! కానీ దీనివల్ల సహజ నూనెలు తరిగిపోవడమే కాదు, చర్మమూ నిర్జీవంగా మారుతుంది. కాబట్టి... ముందు ఏదైనా ఆయిల్‌ బేస్‌డ్‌ క్లెన్సర్‌... అంటే క్లెన్సింగ్‌ ఆయిల్‌, బామ్‌లు అని దొరుకుతున్నాయి కదా! వాటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. అది కూడా నీటితో ముఖాన్ని కడిగాక కాదు. నేరుగా ముఖానికి మర్దనా చేసినట్లుగా రుద్ది, ఆపై గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడిగేయాలి. ఆ తరవాత వాటర్‌ బేస్‌డ్‌ క్లెన్సర్‌తో మరోసారి శుభ్రం చేసుకుంటే డబుల్‌ క్లెన్సింగ్‌ పూర్తయినట్లే!
  • ఆయిల్‌ బేస్‌డ్‌ క్లెన్సర్‌ చర్మరంధ్రాల్లో లోతుగా పేరుకుపోయిన దుమ్మూధూళీ, మేకప్‌, సన్‌స్క్రీన్‌లను పూర్తిగా తొలగించేస్తుంది. ఇక వాటర్‌ బేస్‌డ్‌ క్లెన్సర్‌ తరవాత మనం రాయబోయే సీరమ్‌, క్రీములు చర్మంలోకి చొచ్చుకొనిపోయి ప్రభావవంతంగా పనిచేయడంలో సాయపడుతుంది.

అందరికీ ఒకటేనా?

ఆయిల్‌ బేస్‌డ్‌ క్లెన్సర్లను జిడ్డు చర్మం ఉన్నవారూ ఎంచుకోవచ్చు. అయితే వాటర్‌ బేస్‌డ్‌ వాటి విషయంలో మాత్రం చర్మతీరును బట్టి ఎంచుకోవాలి. పొడి, సున్నితమైన, సాధారణ చర్మతత్వం ఉన్నవారు పరిమళాలు మృదువైన రకాలు... క్రీముల రూపంలో ఉన్న ఫేస్‌వాష్‌లు ఎంచుకోవాలి. జిడ్డు, యాక్నే ఉన్నవారికి ఫోమ్‌వి సరిపడతాయి.

ఎవరైనా చేయాల్సిందేనా?

ఇలా రెండుసార్లు ముఖం కడిగాక మరీ పొడిబారుతోందంటారు డ్రై స్కిన్‌ వాళ్లు. ఆయిలీ వాళ్ల నుంచేమో మరింత జిడ్డుగా మారుతోందని ఫిర్యాదు చేస్తారు. మేకప్‌ రాసేవాళ్లకి ఇది... మాకెందుకు అనేవారూ లేకపోలేదు. నిజంగా డబుల్‌ క్లెన్సింగ్‌ అందరికీ తప్పనిసరా అంటే లేదనే చెబుతారు నిపుణులు. రాత్రివేళ ముఖానికి రాసే క్రీముల జాబితా తక్కువే. పైగా దుమ్మూధూళీ చేరే అవకాశాలూ అరుదే. కాబట్టి, ఉదయం దీన్ని పాటించనక్కర్లేదు. బయటికి వెళ్తున్నా, సన్‌స్క్రీన్‌, మేకప్‌ లాంటివి రాస్తున్నా డబుల్‌ క్లెన్సింగ్‌ కావాలి. కాబట్టి, రాత్రివేళ వరకూ దీన్ని పాటిస్తే సరి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్