చలువద్దాలకూ... చక్కని కవర్లు..!

భానుడి ప్రతాపం మొదలైంది. నడినెత్తిన నిప్పులు కురిపిస్తున్నాడు. ఈ ఎండలో పడతుల నేత్ర సౌందర్యం తగ్గకుండా, కనురెప్పల సోయగం చెదరకుండా ఉండాలంటే చలువద్దాలు చెంత ఉండాల్సిందే.

Updated : 23 Mar 2024 14:14 IST

భానుడి ప్రతాపం మొదలైంది. నడినెత్తిన నిప్పులు కురిపిస్తున్నాడు. ఈ ఎండలో పడతుల నేత్ర సౌందర్యం తగ్గకుండా, కనురెప్పల సోయగం చెదరకుండా ఉండాలంటే చలువద్దాలు చెంత ఉండాల్సిందే. ఇంత ఉపయోగకరమైన అద్దాలను భద్రపరుచుకోవాలంటే అందమైన కవర్లూ... ఉండాల్సిందే. ఆ ఆలోచనే డిజైనర్లకూ వచ్చి, వీటి కవర్లకు ఫ్యాషన్‌ లుక్‌ తెచ్చారు. అవేంటో చూద్దాం.

కూలింగ్‌ గ్లాస్‌లను పెట్టే ఈ కవర్లను అచ్చంగా బ్యాగును పోలేలా డిజైన్‌ చేస్తున్నారు. అవి కళ్లద్దాలవి... అని చూడగానే తెలిసేలా కొన్నింటికి కనురెప్పలనూ, మరికొన్నింటికి కళ్లజోడు ఆకృతులనూ తెస్తున్నారు. వీటికి అదనంగా రంగు రంగుల రాళ్లను పొదిగి జిగేల్‌మనిపిస్తున్నారు. దీంతో ఇవి అమ్మాయిల ఫ్యాషన్‌కు కేరాఫ్‌గా నిలుస్తున్నాయి. ఫోన్‌ బెల్ట్‌, ఆఫీస్‌బ్యాగు, హ్యాండ్‌బ్యాగుల వంటి వాటన్నింటికీ అటాచ్‌ అవుతూ... అదరహో అనిపిస్తున్నాయి. ఈ చలువద్దాల కవర్లు మీకూ నచ్చుతాయి. ఓ లుక్‌ వేసేయండి. ఈ వేసవి ఎండను కూడా చల్లగా మార్చేసుకోండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్