మెరిసిపోవాలంటే...

అందంగా కనిపించాలని... కనిపించిన సౌందర్య ఉత్పత్తులన్నీ వాడటం వల్ల రసాయనాలు చర్మానికి హాని చేసే ప్రమాదం ఉంది. బదులుగా ఇంటి చిట్కాలను పాటించి చూడండి..

Published : 16 Jul 2021 01:47 IST

అందంగా కనిపించాలని... కనిపించిన సౌందర్య ఉత్పత్తులన్నీ వాడటం వల్ల రసాయనాలు చర్మానికి హాని చేసే ప్రమాదం ఉంది. బదులుగా ఇంటి చిట్కాలను పాటించి చూడండి..

పాలమీగడలో రెండు చుక్కల నిమ్మరసం కలిపి రోజూ స్నానానికి వెళ్లే ముందు రాసుకోవాలి. కాసేపయ్యాక కాస్త పెసర పిండిలో గులాబీ నీళ్లు కలిపి ఒంటికి పట్టించి నలుగు పెట్టుకుని స్నానం చేస్తే... మచ్చలు, మొటిమలు తగ్గి ముఖం కాంతులీనుతుంది.

* కీరదోస, నిమ్మరసాన్ని సమపాళ్లలో తీసుకుని దానికి చిటికెడు పసుపు కలుపు కోవాలి. ఈ మిశ్రమాన్ని రోజూ ఉదయాన్నే ముఖానికి రాసుకుని పదిహేను నిమిషాల తరవాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ఇలా రోజూ చేస్తుంటే క్రమంగా చర్మఛాయ మెరుగుపడుతుంది.

* రెండు చెంచాల నిమ్మరసంతో చెంచా తేనె, కోడిగుడ్డులోని తెల్లసొన వేసి బాగా గిలకొట్టాలి. దీన్ని ముఖం, మెడ, చేతులకు రాసుకుంటే... నలుపు తగ్గుతుంది. చర్మం బిగుతుగా మారుతుంది.

* చుండ్రు ఇబ్బంది పెడుతున్నప్పుడు నిమ్మరసంలో రెండు చుక్కల ఆలివ్‌ నూనె కలిపి తలకు పట్టించి మర్దన చేయాలి. ఆపై తలకు ఆవిరి పట్టి గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేస్తే సరి. వెంట్రుకలు నిగనిగలాడతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్