టిఫిన్‌ తినడం లేదా?

సమయం లేదనో, బరువు పెరుగుతామనో... చాలా మంది అమ్మాయిలు టిఫిన్‌ మానేస్తుంటారు. ఇలా తరచూ చేస్తుంటే అనారోగ్యం తప్పదని హెచ్చరిస్తున్నారు నిపుణులు...

Published : 07 Sep 2021 00:39 IST

సమయం లేదనో, బరువు పెరుగుతామనో... చాలా మంది అమ్మాయిలు టిఫిన్‌ మానేస్తుంటారు. ఇలా తరచూ చేస్తుంటే అనారోగ్యం తప్పదని హెచ్చరిస్తున్నారు నిపుణులు...

బరువు పెరుగుతారు... మీరు చదివింది నిజమే. ‘తినకపోతే ఎలా బరువు పెరుగుతాం’ అనుకుంటున్నారా? ఉదయం తినడం మానేస్తే.. మధ్యాహ్నానికి ఆకలి పెరుగుతుంది. దాంతో అదుపు తప్పి తినే ప్రమాదం ఉంది. ఇదే బరువు పెరిగేందుకు కారణం. అలాకాకుండా పొద్దున్నే అల్పాహారం తీసుకోవడం వల్ల  జీవక్రియల పనితీరు కూడా బాగుంటుంది.. శరీరానికి సరిపడా శక్తి అందుతుంది.

నెలసరి సమస్యలు:  తరచూ అల్పాహారం స్కిప్‌ చేస్తుంటే... జీవక్రియా రేటు తగ్గుతుంది. శరీరానికి సరైన పోషకాలు అందక హార్మోన్ల అసమతుల్యత తలెత్తుతుంది. దాంతో నెలసరిలో మార్పులు, మలబద్ధకం వంటి ఇబ్బందులూ తప్పకపోవచ్చట.

ఉత్సాహంగా ఉండాలంటే... కొందరు అమ్మాయిలు చిన్న పనులు చేసినా అలసిపోతారు. ఇలాంటి వారు పొద్దున్నే తృణధాన్యాలతో కూడిన అల్పాహారం, గుడ్లు, పాలు వంటివి సమృద్ధిగా తీసుకుంటే... రోజంతా చురుగ్గా ఉంటారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్