ఇంద్రధనుస్సు ఇసుక
close
Published : 17/01/2022 00:11 IST

ఇంద్రధనుస్సు ఇసుక!


పెద్దగా నీటి అవసరం లేకుండా, పరిమిత పోషకాలతో బతికే సకులెంట్స్‌, ఎడారిమొక్కలని గాజు పాత్రల్లో ఉంచి ఇంట్లో పెంచుతుంటారు. వీటినే  టెర్రారియం గార్డెన్స్‌ అంటారు. అయితే ఈ టెర్రారియం అందాన్ని మరింతగా పెంచేదే శాండ్‌ ఆర్ట్‌ టెర్రారియం విధానం. శాండ్‌ ఆర్ట్‌కి  సంబంధించిన రంగురంగుల ఇసుకని బజారులో అమ్ముతుంటారు. ఈ ఇసుకని గాజుపాత్రల్లో నింపి... కాస్త సృజనాత్మకతని చూపిస్తే చాలు. వాటిల్లో నీటి అవసరం తక్కువగా ఉండే మొక్కలనీ లేదా కృత్రిమ మొక్కలని ఇలా అమర్చుకుంటే సరి. ఇదిగో ఇలా మెరిసిపోతూ ఇంటికి కొత్త అందాన్ని మోసుకొస్తాయి.


Advertisement

మరిన్ని