పాలు తాగించడం తేలికిక!

బుజ్జిబుజ్జి చేతులు రెండూ కలిపి ప్రయత్నించినా... పాలసీసాని చేతులతో పట్టుకుని, తమంతట తాము పాలను తాగలేరు పసిపిల్లలు. అలా తాగే ప్రయత్నంలో ఆ సీసాని తరచూ కింద పడేస్తుంటారు.

Updated : 25 Jan 2022 04:40 IST

బుజ్జిబుజ్జి చేతులు రెండూ కలిపి ప్రయత్నించినా... పాలసీసాని చేతులతో పట్టుకుని, తమంతట తాము పాలను తాగలేరు పసిపిల్లలు. అలా తాగే ప్రయత్నంలో ఆ సీసాని తరచూ కింద పడేస్తుంటారు. అలా చేస్తే పాలపీక నేలను తాకి క్రిములు అంటుకునే ప్రమాదమూ ఉంది. ఇలా కాకుండా చేసేదే ఈ బేబీ బా బాటిల్‌ హోల్డర్‌. పాలసీసాకి దీన్ని అమర్చేస్తే సరి. దీనికున్న పెద్ద రంధ్రాల వల్ల పిల్లలు తేలిగ్గా సీసాని పట్టుకుంటారు. ఒకవేళ సీసాని కింద పారేసినా దీని ఆకృతి వల్ల పీక నేలను తాకే అవకాశం ఉండదు. ఇది సిలికాన్‌ కవర్‌ కావడంతో సీసా కూడా పగిలిపోదు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్