మీకంటూ కాస్త సమయం!

అమ్మా షాపింగ్‌ వెళదామా... అమ్మాయి కోరిక. ఏమోయ్‌ ఈ రోజు ఏదైనా స్వీట్‌ చేసిపెట్టు.. శ్రీవారి ఆర్డరు. సరకులు నిండుకున్నాయమ్మాయ్‌... అత్తగారి హెచ్చరిక. ఆదివారం వచ్చిందంటే చాలు... కుటుంబంలోని ఒక్కోరూ ఏమేం కావాలో జాబితా చెబుతూనే ఉంటారు.

Updated : 01 Feb 2022 04:06 IST

అమ్మా షాపింగ్‌ వెళదామా... అమ్మాయి కోరిక. ఏమోయ్‌ ఈ రోజు ఏదైనా స్వీట్‌ చేసిపెట్టు.. శ్రీవారి ఆర్డరు. సరకులు నిండుకున్నాయమ్మాయ్‌... అత్తగారి హెచ్చరిక. ఆదివారం వచ్చిందంటే చాలు... కుటుంబంలోని ఒక్కోరూ ఏమేం కావాలో జాబితా చెబుతూనే ఉంటారు. సెలవు రోజున కుటుంబానికి  సమయం ఇస్తూనే మీకూ కాస్త కేటాయించుకోండిలా..!

వ్యాయామం... ఆ రోజు సెలవు దొరికిందని రోజూ చేసే వర్కవుట్లకు స్వస్తి పలకొద్దు. మరోటి కొత్తది నేర్చుకుని కాసేపు ఎక్కువ సమయం చేయండి. ఆరోగ్యం, ఆనందం రెండూ దక్కుతాయి.

నచ్చిన పని... బొమ్మలు గీయడం, పుస్తకాలు చదవడం, పాటలు వినడం... మీకేది ఇష్టమో దానికోసం ఓ అరగంట పెట్టేసుకోండి. ఆ సమయంలో నచ్చిన పని చేసుకోండి. మనసు సంతోషంతో నిండిపోతుంది.

విశ్రాంతి... వారం రోజులు అలిసిన శరీరానికి చక్కగా నూనె పట్టించి మర్దనా చేసుకోండి. వేడి వేడి నీళ్లతో స్నానం చేస్తే హాయిగా ఉంటుంది. వీలైతే దగ్గరలోని స్పాకి వెళ్లండి.

ప్రణాళిక.. వచ్చే ఆరు రోజులు కంగారు పడకుండా ఉండేందుకు పక్కా ప్రణాళికను రూపొందించుకోండి. ఆ వారానికి సరిపడా కూరగాయలు, పచారీ సామన్లు అన్నింటినీ తెప్పించేసుకోండి.

మాట్లాడండి... స్నేహితులు, బంధువులు... ఇలా ఇష్టమైన వారితో కాసేపు మాట్లాడండి. దూరంగా ఉంటే ఫోన్‌లో సంభాషించండి. వీలైతే ఓసారి కలిసి రండి. ఆ కబుర్లు తెలియని ఆనందాన్నిస్తాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్