నాదే నేరం అంటున్నారు..

నేనో ప్రైవేట్‌ ఆసుపత్రిలో నర్సును. తాగుడువల్ల మా ఆయన ఉద్యోగం మానేశారు. ఒకరోజు తాగడానికి డబ్బు ఇవ్వలేదని నేను డ్యూటీ నుంచి వచ్చేసరికి ఆత్మహత్య చేసుకున్నారు. అందరూ నన్నే

Updated : 17 Aug 2021 04:40 IST

నేనో ప్రైవేట్‌ ఆసుపత్రిలో నర్సును. తాగుడువల్ల మా ఆయన ఉద్యోగం మానేశారు. ఒకరోజు తాగడానికి డబ్బు ఇవ్వలేదని నేను డ్యూటీ నుంచి వచ్చేసరికి ఆత్మహత్య చేసుకున్నారు. అందరూ నన్నే తప్పు పడుతున్నారు. పెళ్లైనప్పటి నుంచి కుటుంబాన్ని నేనే పోషిస్తున్నాను. అయినా నిందలు.. ఒక్కోసారి అపరాధ భావంతో చనిపోవాలనిపించినా రెండేళ్ల మా పాప కోసం బతుకుతున్నాను. ఏం చేయాలో అర్థం కావడంలేదు.

- ఓ సోదరి, విజయనగరం

ల్కహాల్‌కి బానిసలైనవారు అది దొరక్కపోతే తట్టుకోలేరు. అలజడికి లోనవుతారు. కాళ్లూ చేతులూ వణుకుతాయి. అప్పు చేసో, దొంగిలించో ఏదో రకంగా తాగాలనుకుంటారు. బతిమాలి, బెదిరించి, మాయమాటలు చెప్పి.. ఎలాగోలా డబ్బు సంపాదిస్తారు. ఇవ్వకపోతే చనిపోతామని బెదిరిస్తారు కూడా. వారిలో న్యూనత, డిప్రెషన్‌లకు గురయ్యే అవకాశమూ ఉంది. కనుక అతని చావుకు మీరు కారణం కాదు. అలా తప్పుపడుతున్న వారు అతని బాధ్యత తీసుకుని తాగకుండా చికిత్స ఇప్పించాల్సింది. తాగే వ్యక్తికి కంట్రోల్‌ ఉండదు కనుక అలా చేసివుండొచ్చు. అందులో మీ బాధ్యత లేదు. ఎవరైనా అన్నా లెక్క చేయొద్దు. అపరాధ భావన మనసులోంచి తీసేయండి. ఆ బాధ్యత అందరిదీ. ముఖ్యంగా అతని తరపువారు వ్యసనంగా మారకుండా చూడాల్సింది. లేదా సముదాయించి మాన్పించాల్సింది. అందువల్ల ఎవరేమన్నా పట్టించుకోవద్దు. మీకు పాప వుంది కనుక ఉద్యోగం మీద మనసుపెట్టి వచ్చిన ఆదాయంతో బాగా చదివించి స్వతంత్రంగా ఎదిగేలా చూడండి. వందమంది వందరకాలుగా అనుకుంటారు. లక్ష్యపెట్టొద్దు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని