అతని వల్ల చదవలేకపోతున్నా..

నా వయసు 23. ఉద్యోగం చేస్తూ సివిల్స్‌కి ప్రిపేర్‌ అవుతున్నా. మా ఆఫీసులో ఒక అబ్బాయితో స్నేహం ఏర్పడింది. అతను నన్ను చాలా గౌరవిస్తాడు. నిజానికి నేను చాలా ఇంట్రావర్ట్‌ని. కానీ కొద్దిరోజుల్లోనే అతనితో అన్నీ పంచుకునే సాన్నిహిత్యం ఏర్పడింది. కానీ రెండు వారాలుగా మేమిద్దరం మాట్లాడుకోవట్లేదు. తను బాగానే ఉన్నాడు కానీ.. నేనే చాలా డిస్టర్బ్‌ అయ్యా. చదువుపైనా శ్రద్ధ పెట్టలేకపోతున్నా. భయంగా ఉంది. ఏం చేయాలో సలహా ఇవ్వండి. 

Published : 25 Dec 2023 01:23 IST

ఓ సోదరి

మీరు అతన్ని కలిసేముందే.. సివిల్స్‌ లక్ష్యంగా పెట్టుకున్నారు. అది మీ కెరియర్‌ ఉన్నతికి సంబంధించింది. మరోవైపు అతనితో స్నేహం.. మీ మనసుకు సంబంధించింది. మీరు మీ మనసు అదుపులో ఉంచుకోగలిగితేనే రెంటినీ సమంగా చూడగలరు. కానీ మీరు మీ లక్ష్యం నుంచి పక్కకు వెళుతున్నారు. ఇప్పటి స్నేహానికి ప్రాధాన్యమిచ్చి దాన్ని పక్కన పెట్టేస్తున్నారు. ఇది మంచిది కాదు. ముందు సన్నద్ధతపై దృష్టిపెట్టండి. నాలుగు నెలల స్నేహం వల్ల మనసు కదిలిపోయిందంటే.. మీకు సంకల్ప శక్తి తగ్గిందని అర్థం. ముందు స్థిమితంగా కూర్చొని జీవితంలో ఏం చేయాలనుకున్నారో పేపరు మీద రాసుకోండి. మీ స్నేహానికి అర్థమేంటనేదీ ఆలోచించండి. ముందు మీరొక స్థానానికి వెళితే తర్వాత అతని గురించి ఆలోచించొచ్చు. కాబట్టి, ఆలోచనలు పక్కనపెట్టి.. పరీక్షలపై దృష్టిపెట్టండి. అవయ్యాక తీరిగ్గా అతనితో మాట్లాడొచ్చు. నిజానికి మీ చదువుకు అడ్డం రాకూడదనే ఉద్దేశంతోనే అతనూ అలా దూరంగా ఉంటుండొచ్చు. కాబట్టి.. మనసును నిమ్మలంగా ఉంచుకొని ప్రిపరేషన్‌ సాగించండి. అనవసర విషయాల గురించి సమయాన్ని వృథా చేయకుండా, పట్టుదలతో మీరు మీ లక్ష్యాన్ని సాధిస్తే అతను కూడా మిమ్మల్ని అభినందిస్తాడు. మనసు మళ్లుతోంటే ఇతర వ్యాపకాల గురించి ఆలోచిస్తే సరిపోతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్