అభద్రత రానీయొద్దు!

ఆలుమగల అనుబంధానికి ప్రత్యేక నియమావళి ఏమీ ఉండదు. పరిస్థితులను బట్టి సర్దుకోవాలి. ఇష్టాయిష్టాలను పంచుకోవాలి. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ అడుగులేయాలి. అప్పుడే జీవితం హాయిగా సాగిపోతుంది.

Published : 16 May 2021 00:41 IST

ఆలుమగల అనుబంధానికి ప్రత్యేక నియమావళి ఏమీ ఉండదు. పరిస్థితులను బట్టి సర్దుకోవాలి. ఇష్టాయిష్టాలను పంచుకోవాలి. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ అడుగులేయాలి. అప్పుడే జీవితం హాయిగా సాగిపోతుంది.
* కలిసి ప్రణాళిక: వేర్వేరు నేపథ్యాలున్న మీ అలవాట్లు కూడా అలానే ఉండి ఉండొచ్చు. అందుకని మీకునచ్చినట్లే ఎదుటి వారు చేయాలనే పంతం వద్దు. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో పొదుపు, దుబారా వంటి అంశాలమీద ఎక్కువగా వాగ్వివాదాలు జరుగుతుంటాయి. మీ మధ్యా అలాంటివి వస్తుంటే... కలిసి కూర్చుని ప్రణాళిక వేసుకోండి. అప్పుడే చిన్న చిన్న సమస్యలు అదుపులోకి వస్తాయి. రాన్రానూ ఆర్థిక క్రమశిక్షణ అలవడుతుంది.
* అభద్రత: ఒకరికొకరుగా జీవితాంతం ప్రేమానురాగాల మధ్య నడవాలి. ఒక్కోసారి చిన్న విషయమే అనిపించినా ఎదుటి వారిలో అభద్రతకు కారణం కావొచ్చు. అందుకే పారదర్శకంగా ఉండటానికి ప్రయత్నించండి. ఒకవేళ మీ విషయంలోనే ఎదుటివారు అలా భావిస్తుంటే... అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అపార్థాలనూ అపోహల్ని తొలగించుకునే ప్రయత్నం చేయండి. అప్పుడే అనుబంధం హాయిగా సాగిపోతుంది.
* ప్రేమించండి: కోపంతో సాధించలేని ఎన్నో పనులు ప్రేమతో చేయొచ్చు. ఎదుటివారిలో మార్పు కోరుకున్నప్పుడు మీరు చెప్పాలనుకునే విషయం కోపంతోనో, ఆవేశంతోనో కాకుండా సున్నితంగా చెప్పిచూడండి. ఉద్వేగాలతో ఎదుటి వారి కాళ్లకు బంధనాలు వేయడం వల్ల... ఇద్దరి మధ్యా అగాధం పెరిగే ప్రమాదం ఉంది. ప్రేమను వ్యక్తం చేయడంలో అందరి తీరూ ఒకేలా ఉండకపోవచ్చు. అర్థం చేసుకుని అడుగులేస్తే ఆనందమే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్