వీటితో ‘ఐ మేకప్‌’ వేసుకోవడం సులువు!

ముఖానికి మేకప్‌ వేసుకోవడం కంటే.. కళ్లను తీర్చిదిద్దుకోవడం కాస్త కష్టమే! ఐ మేకప్‌లో భాగంగా.. కంటికి కాటుక, మస్కారా, ఐ లైనర్‌ వంటివి అప్లై చేసుకునే క్రమంలో సరిగ్గా షేప్‌ రాకపోవడం, పక్కలకు అంటుకోవడం చాలామందికి అనుభవమే

Published : 22 Sep 2023 20:18 IST

ముఖానికి మేకప్‌ వేసుకోవడం కంటే.. కళ్లను తీర్చిదిద్దుకోవడం కాస్త కష్టమే! ఐ మేకప్‌లో భాగంగా.. కంటికి కాటుక, మస్కారా, ఐ లైనర్‌ వంటివి అప్లై చేసుకునే క్రమంలో సరిగ్గా షేప్‌ రాకపోవడం, పక్కలకు అంటుకోవడం చాలామందికి అనుభవమే! అలాగని మళ్లీ మళ్లీ చెరిపేసి వేసుకుంటే ఎబ్బెట్టుగా కనిపిస్తుంది. ఈ సమస్య లేకుండా.. ఐ మేకప్‌ను చక్కగా, సులువుగా తీర్చిదిద్దుకోవడానికి ప్రస్తుతం ‘ఐ స్టెన్సిల్స్‌’ అందుబాటులోకొచ్చాయి.

‘Y’, ‘T’.. వంటి ఆకృతుల్లో, క్యాట్‌ షేప్‌లో, పొడవాటి స్టిక్‌ మాదిరిగా, కంటి చుట్టూ ఫిక్స్‌ చేసుకునేలా.. ఇలా విభిన్న షేప్స్‌లో ఇవి లభిస్తున్నాయి. వీటిని ఫొటోల్లో చూపినట్లుగా కళ్ల కింద, రెప్పల పైన అమర్చుకొని.. సులభంగా కంటి మేకప్‌ను తీర్చిదిద్దుకోవచ్చు. కనురెప్పలపై విభిన్న షేడ్స్‌ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ స్టెన్సిల్‌తో కంటి చివర్లో ఐ లైనర్‌తో వింగ్‌ను కూడా క్షణాల్లో తీర్చిదిద్దుకోవచ్చు. వీటిని ఉపయోగిస్తే కంటి మేకప్‌ ఉత్పత్తులు కళ్లలోకి వెళ్లకుండా, పక్కలకు అంటుకోకుండా జాగ్రత్తపడచ్చు. పైగా ఐ మేకప్‌ను నీట్‌గా కూడా తీర్చిదిద్దుకోవచ్చు. ఇక ఇవి సిలికాన్‌తో తయారైనవి కాబట్టి సులభంగా వంగుతాయి కూడా! అయితే ఈ స్టెన్సిల్స్‌ను కంటికే కాదు.. లిప్‌స్టిక్‌ వేసుకునేటప్పుడు పెదాల చుట్టూ కూడా అమర్చుకోవచ్చంటున్నారు నిపుణులు. తద్వారా లిప్‌స్టిక్‌ పక్కలకు అంటుకోకుండా నీట్‌గా అప్లై చేసుకోవచ్చంటున్నారు. ఇలా విభిన్న రకాలుగా ఉపయోగపడే ఐ స్టెన్సిల్స్‌పై మీరూ ఓ లుక్కేయండి!

Photos: Amazon.in

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని