చెప్పకుండా వెళ్లిపోయానని నోటీసులిచ్చాడు!
నాకు నాలుగేళ్ల క్రితం పెళ్లయ్యింది. మా వారి చెల్లెలు భర్తతో గొడవల కారణంగా... మూడేళ్ల పాపతో పుట్టింట్లోనే ఉంటోంది. పెళ్లికి ముందు అడిగితే... సమస్యలున్నాయి. తగ్గాక వెళ్లిపోతుంది అన్నారు. కానీ అది జరగలేదు. పైగా తర్వాత వారి బాధ్యత తనదే అన్నాడు. నాతో సరిగా ఉండడు. ఆరోగ్యం బాగోక వాళ్లను అడిగే పుట్టింటికి వచ్చా. మూడు నెలలు ఒక్క ఫోనూ చేయలేదు. అకస్మాత్తుగా నా భార్య చెప్పాపెట్టకుండా ఇంట్లోంచి వెళ్లిపోయింది అని కోర్టు నోటీసు పంపాడు. మా పెద్దలు వెళ్లి మాదే తప్పు, అమ్మాయిని పంపిస్తామని చెప్పి వచ్చారు. ఈలోగానే విడాకులకు దరఖాస్తు చేశాడు. మేము మెయింటెనెన్స్ వేశాం. ఇంత జరిగాక అతను నాతో ఎలా ఉంటాడో తెలియదు. నా సమస్యని ఎలా పరిష్కరించుకోవాలి?
- ఓ సోదరి, గుంటూరు
భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి ఉన్నప్పుడు సమస్యలు రావడం సహజం. మీ ఆడపడుచు ఇంట్లో ఉండటం, వాళ్లను చూసుకుంటానని మీ భర్త చెప్పడం తప్పు కాదు. ఆ విషయాలు ముందుగా మీతో చెబితే సరిపోయేది. ఇక, మీరా విషయాన్ని పెద్దది చేసి చూడకుండా ఉండాల్సింది. ఇంటి బాధ్యతలు నిర్వర్తిస్తోన్న మిమ్మల్ని గుర్తించకపోవడం, అభినందించకపోవడం వంటివి మిమ్మల్ని బాధించి ఉండొచ్చు. కూర్చుని మాట్లాడుకోవాల్సింది. కానీ చిన్న విషయాలకు విడాకుల దాకా వెళ్లడం తొందరపాటే. ఈ కేసులో మధ్యవర్తి దగ్గరకి కౌన్సెలింగ్‌కి వెళ్లారో లేదో తెలియలేదు. అక్కడ మీకు డైవోర్స్ ఇష్టం లేకపోతే ఆ విషయం చెప్పొచ్చు. మీడియేటింగ్ కోసం మహిళా పోలీస్స్టేషన్ల్లోనూ ప్రత్యేక విభాగాలు ఉన్నాయి. అయితే ఇలా స్టేషన్‌కి పిలిపిస్తే మగవారు... అఫెండ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి కోర్టులోనే మీ సమస్యని తేల్చుకోండి. ఒకవేళ అతడితో తిరిగి జీవితం పంచుకోవాలనుకుంటే... హిందూ వివాహచట్టంలోని సెక్షన్ 9 ప్రకారం కంజుగల్ రైట్స్ కోసం దరఖాస్తు చేయొచ్చు. ముందు ఆ పనిచేయండి. ఇక మీ కట్నకానుకలు, వస్తువులు తీసుకోవాలనుకుంటే.... గృహహింస చట్టం, విడాకుల కేసు, మెయింటెనెన్స్‌ల వంటివి వేసి తిరిగి తీసుకోవచ్చు.
మీ ప్రశ్న అడగండి
మరిన్ని
నడుము ఆ కొలత దాటనివ్వొద్దు!
కుటుంబ ఆర్యోగం మహిళ చేతిలోనే ఉంటుంది. చిన్న చిన్న అలవాట్లతో కుటుంబాన్నంతా ఆరోగ్యంగా ఉంచొచ్చు. రోజూ ఆకుకూరతోపాటు తాజా పండ్లు తప్పక అందించండి. ఒకపూట గోధుమలు, చిరుధాన్యాలతో చేసిన ఆహారం లేదా గుగ్గిళ్లు లాంటివి పెట్టండి. ముందు నుంచే పోషక పదార్థాలు తీసుకుంటూ,తరువాయి
ప్రెగ్నెన్సీలో ఎంత హిమోగ్లోబిన్ ఉండాలి?
గర్భం ధరించినప్పుడు హిమోగ్లోబిన్ శాతం 11కి తగ్గకుండా చూసుకోవాలి. అబార్షన్ అయినప్పుడు కొన్నిసార్లు విపరీతంగా రక్తస్రావమవుతుంది. ఇదీ రక్తహీనతకు దారి తీస్తుంది. ఎనీమియా సమస్య ఉన్న మహిళల్లో ఇలాంటి ఇబ్బందులొస్తే పరిస్థితి మరింత జటిలమవుతుంది. నాలుగు శాతం హిమోగ్లోబిన్ అంటే చాలా తక్కువ. అతి త్వరగా హిమోగ్లోబిన్ పెంచుకునే పద్ధతులేంటో మీ వైద్యులనడిగి తెలుసుకోండి. వాపు, శ్వాస ఇబ్బందులు, జ్వరం, అలసట... లాంటి ఇతర లక్షణాలను బట్టి చికిత్సను ...తరువాయి
మందులతో పీసీఓఎస్ పూర్తిగా తగ్గదా?
నాకు 24. వివాహమై ఏడాదవుతోంది. ఈ మధ్యే పీసీఓఎస్ బారిన పడ్డా. దీన్ని నియంత్రణలో ఉంచుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?తరువాయి
త్వరగా బరువు తగ్గాలంటే..!
నా వయసు 40. బరువు 80. ఎత్తు 5.3. నెలపాటు కేవలం పండ్లు, పండ్ల రసాలు తీసుకుంటూ వ్యాయామాలు చేస్తే త్వరగా బరువు తగ్గుతానని ఎవరో చెప్పారు. ఇది సరైన పద్ధతేనా?తరువాయి
బరువు తగ్గితే మంచిది కాదా!
మందులు, ఆహారానికి మధ్య సమతుల్యత లోపించడం, వ్యాయామం చేయకపోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయులు పెరుగుతాయి. ఈ వయసులో బరువు నియంత్రణ మంచిదే. కానీ, కారణం లేకుండా రక్తంలో చక్కెర స్థాయులు పెరిగి, వెయిట్, మజిల్ మాస్ తగ్గడం మంచిది కాదు. కాబట్టి.తరువాయి
కట్నం ఇవ్వలేదు..ఆస్తిలో వాటా అడగొచ్చా?
మా తాతయ్య మా అమ్మమ్మకి తెలియకుండా మరో ఆమెతోనూ కాపురం చేశారు. కానీ పెళ్లి చేసుకోలేదు. అమ్మమ్మకి ముగ్గురు అమ్మాయిలు. ఆవిడకు ఇద్దరబ్బాయిలు. ఈ మధ్య తాతయ్య అనారోగ్యంతో మరణించారు. అప్పటి నుంచి ఆస్తి తగాదాలొచ్చాయి. ఆయన పేరున కొంత ఆస్తి ఉంది. మిగిలినది రెండో భార్య కొడుకుల పేరు మీద పహాణీ ఉంది. కానీ రిజిస్ట్రేషన్ కాలేదు. మా తాతయ్య కూతుళ్లకు పెళ్లి చేసి పంపాడే తప్ప.......తరువాయి
చెప్పకుండా వెళ్లిపోయానని నోటీసులిచ్చాడు!
నాకు నాలుగేళ్ల క్రితం పెళ్లయ్యింది. మా వారి చెల్లెలు భర్తతో గొడవల కారణంగా... మూడేళ్ల పాపతో పుట్టింట్లోనే ఉంటోంది. పెళ్లికి ముందు అడిగితే... సమస్యలున్నాయి. తగ్గాక వెళ్లిపోతుంది అన్నారు. కానీ అది జరగలేదు. పైగా తర్వాత వారి బాధ్యత తనదే అన్నాడు.తరువాయి
రక్తస్రావం తగ్గడం లేదు..
నా వయసు 45. ఇద్దరు పిల్లలు. కొన్నాళ్లుగా నెలసరి సమయంలో తీవ్ర రక్తస్రావమవుతోంది. అది కూడా ఎక్కువ రోజులు ఉంటోంది. నొప్పి వస్తోంది. ఇంతకుముందెప్పుడూ ఇలా లేదు.తరువాయి
తప్పు చేశా...బాధపడుతున్నా..
మా బావ నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకుంటానంటే... తను నాలా చదువుకోలేదన్న కారణంతో కాదన్నాను. తర్వాత నేను బాగా చదువుకున్న వ్యక్తినే చేసుకున్నా. కానీ అతడికి అన్ని రకాల దురలవాట్లూ ఉన్నాయి. బావ లాంటి మంచి మనిషిని బాధ పెట్టినందుకే నాకు ఇలా...తరువాయి
మా ఆడపడుచు మా ఆస్తిలో వాటా అడుగుతోంది!
మా వారికి ఇద్దరక్కలు. వాళ్ల పెళ్లిళ్లప్పుడే తలా ఒక ఎకరం చొప్పున రాసిచ్చారు. మిగిలిన మూడెకరాలు మామగారి తదనంతరం ఎలానూ మాకే కదా అనే ధీమాతో మా వాటా రాయమని అడగలేదు. ఇప్పుడు ఆ ఆస్తిలో మాకూ హక్కు ఉందంటోంది మా ఆడపడుచు. వారిది వారికిచ్చేశాక మళ్లీ ఇందులో వాటాకి వస్తే మా పిల్లల భవిష్యత్తు ఏంటి? మా మామగారిని రాయమని అడిగితే...మేం పిల్లల మీద ఆధారపడం.తరువాయి
బ్యూటీ & ఫ్యాషన్
- పొడారిన అధరాలకు...
- కాలర్ ఎగరేస్తున్న నయా ఫ్యాషన్..
- Kareena Kapoor : అప్పుడు జుట్టు బాగా రాలేది.. ఇలా కంట్రోలైంది!
- మీ కళ్లు చిన్నవా..?
- చర్మ సౌందర్యానికి ‘గుడ్డు’..!
ఆరోగ్యమస్తు
- వ్యాయామం విసుగొస్తోందా?
- ఫిట్స్ ఉన్న వారు గర్భం దాల్చచ్చా?!
- అది ఆకలి కాదేమో!
- సిస్టులుంటే పిల్లలు పుట్టరా?
- ఈ రంగురంగుల టీలతో ఆరోగ్యాన్ని పెంచుకుందాం!
అనుబంధం
- అంతమందిని చూస్తే భయం...
- Parenting Tips : ఫ్యామిలీ టెన్షన్స్ పిల్లల దాకా రాకుండా..!
- ఈ బద్ధకపు భర్తతో వేగేదెలా?!
- సానుకూలం.. సామరస్యం..
- Besties Forever: ఇదే మా గర్ల్ గ్యాంగ్!
యూత్ కార్నర్
- పశువులు మేపి.. సైనికాధికారి అయ్యింది!
- మనమూ కనొచ్చు...కెమెరా కలలు!
- అమ్మకు ఉపాధి.. ఆమె వ్యాపారం!
- మన జీవితాలే... రోజుకొక కథగా!
- వరుస గాయాలు.. ఆమెను ఆపలేకపోయాయి..
'స్వీట్' హోం
- వాళ్లు ఇప్పుడే అర్థమయ్యారు!
- వంటిల్లు సర్దుతున్నారా?
- ఇంట్లోనే డాగ్ వాష్ తయారుచేద్దాం..!
- గాజు... తోటలు!
- వంటింటి వ్యర్థాలు క్షణాల్లో ఎరువుగా..
వర్క్ & లైఫ్
- ఆ ఆలోచనతో శ్రద్ధగా పనిచేయలేకపోతున్నా.. ఏం చేయను?!
- నాయకురాలు అవుతారా?
- కొత్తగా ఉద్యోగంలో చేరాక..!
- మొదటి ప్రశ్నకు సిద్ధమేనా?
- Work Life Balance : మా ఎమోషన్స్ మీరెందుకు అర్థం చేసుకోరు?!
సూపర్ విమెన్
- చందమామ మట్టిలో మొలకెత్తించారు!...
- ఆక్సిజన్ సపోర్ట్ లేకుండానే పర్వతాలు ఎక్కేస్తోంది!
- అత్త మరణం నన్ను మార్చేసింది!
- ఈ లడ్డూ గర్భిణుల ప్రత్యేకం...
- బాల్య వివాహాన్ని తప్పించుకొని.. ‘గ్లోబల్ నర్స్’గా ఎదిగింది..!