బ్రేకింగ్

breaking
13 Mar 2023 | 08:27 IST

Oscars 2023: ‘నాటు నాటు’కు ఆస్కార్‌ అవార్డు

లాస్ ఏంజిల్స్: బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలోని ‘నాటు నాటు..’ ఉత్తమ పాటగా ఆస్కార్‌ అవార్డును సొంతం చేసుకుంది. ఆస్కార్‌ వేదికపై ఆర్ఆర్‌ఆర్‌ చిత్ర సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి అవార్డును అందుకున్నారు. తద్వారా ఆస్కార్‌ గెలిచిన తొలి భారతీయ చిత్రంగా ఆర్ఆర్‌ఆర్‌, తొలి భారతీయ గీతంగా ‘నాటు నాటు’ చరిత్ర సృష్టించాయి. బెస్ట్‌ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో పోటీ పడిన ‘అప్లాజ్‌’ (టెల్‌ ఇట్‌ లైక్‌ ఏ ఉమెన్‌), ‘లిఫ్ట్‌ మి అప్‌’ (బ్లాక్‌ పాంథర్‌: వకాండా ఫెరవర్‌), దిస్‌ ఈజ్‌ ఎ లైఫ్‌ (ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌’, ‘హోల్డ్‌ మై హ్యాండ్‌’ (టాప్‌గన్‌ మావెరిక్‌) పాటలను వెనక్కి నెట్టి ‘నాటు నాటు..’ ఆస్కార్‌ దక్కించుకుంది.

మరిన్ని

తాజా వార్తలు