Hair Care: జుట్టు పెరగడానికీ మసాజ్!

గోరువెచ్చని నూనెతో మాడుకు నెమ్మదిగా మర్దన చేసుకుంటుంటే ఎంత హాయిగా ఉంటుందో కదూ! ఈవిధంగా మర్దన చేసుకోవడం వల్ల కేవలం మాడుకు రక్తప్రసరణ సక్రమంగా జరగడమే కాకుండా జుట్టు ఎదుగుదల కూడా బాగుంటుంది.

Published : 11 Oct 2023 21:16 IST

గోరువెచ్చని నూనెతో మాడుకు నెమ్మదిగా మర్దన చేసుకుంటుంటే ఎంత హాయిగా ఉంటుందో కదూ! ఈవిధంగా మర్దన చేసుకోవడం వల్ల కేవలం మాడుకు రక్తప్రసరణ సక్రమంగా జరగడమే కాకుండా జుట్టు ఎదుగుదల కూడా బాగుంటుంది. ఈ క్రమంలో మర్దన చేసుకోవడం వల్ల కలిగే ఇతర లాభాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం.

కుదుళ్లకు పోషణ అందిస్తూ..

మాడుకు మర్దన చేసేటప్పుడు ఉపయోగించే నూనె జుట్టుకు పోషణనందించే జొజోబా లేదా బాదం వంటిదైతే మంచిది. దీనివల్ల కుదుళ్లకు రక్తప్రసరణ సాఫీగా జరగడమే కాకుండా కురులకు పోషణ కూడా లభిస్తుంది. ఇలా తరచూ మర్దన చేయడం వల్ల జుట్టు ఎదుగుదల బాగుంటుంది.

కురులు మెరిసేలా..

నూనెతో తరచూ మర్దన చేసుకోవడం వల్ల కురులు మిలమిలా మెరుస్తాయి. అలాగే ఒత్తుగా కూడా కనిపిస్తాయి. చివర్లు చిట్లడం వంటి సమస్యలను సైతం దూరంగా ఉంచడంలోనూ మసాజ్ ఉపయోగపడుతుంది.

చుండ్రు రానీయకుండా..

తరచూ మర్దన చేసుకోవడం ద్వారా తలలో చుండ్రు చేరకుండా జాగ్రత్తపడచ్చు. శిరోజాలు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా ప్రకాశవంతంగా మెరుస్తుంటాయి.

ముఖం ప్రకాశవంతంగా..

తలకు మర్దన చేస్తే ముఖం ఎందుకు ప్రకాశవంతంగా కనిపిస్తుందాని ఆశ్చర్యపోతున్నారా? మాడుకు మృదువుగా మర్దన చేయడం వల్ల ఒత్తిడి తగ్గి రక్తప్రసరణ సక్రమంగా ఉంటుందని చెప్పుకున్నాం కదా! అలాగే తలకు మర్దన చేయడం వల్ల ముఖానికి కూడా రక్తప్రసరణ సవ్యంగా జరిగి మోము కాంతివంతంగా మారుతుంది.

ఈ జాగ్రత్తలు..

మర్దన చేసే క్రమంలో ఎక్కువ మొత్తంలో నూనె ఉపయోగించి, ఆతర్వాత సరిగా శుభ్రం చేసుకోకపోతే తల జిడ్డుగా మారడమే కాదు.. కేశ సంబంధిత సమస్యలను కూడా కొనితెచ్చుకున్నట్లు అవుతుంది.

మర్దన చేసే క్రమంలో స్ట్రోక్స్ సరిగా ఇవ్వకపోతే తలనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది.

చేతివేళ్లతో మర్దన చేసుకుంటాం కాబట్టి వాటికి గోళ్లు లేకుండా జాగ్రత్తపడాలి. లేదంటే అవి మాడుకు గీసుకుపోయే అవకాశం ఉంటుంది.

తలకు మర్దన చేసుకున్న తర్వాత ముఖానికి కూడా కాస్త మృదువుగా మసాజ్ చేసుకుంటే మరిన్ని సత్ఫలితాలు పొందవచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్