Updated : 21/12/2022 04:53 IST

బ్లాక్‌హెడ్స్‌ పోతాయిలా...

* రోజూ ముఖాన్ని రెండుసార్లు శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మంతోపాటు నుదురు, ముక్కు (టీ-జోన్‌) భాగాలు శుభ్రపడతాయి. కసరత్తుల వల్ల చెమట పడుతుంది. దీనిపై దుమ్ము, ధూళి చేరడంతో చర్మరంధ్రాలు మూసుకుపోతాయి. వ్యాయామం తరువాత ముఖాన్ని తప్పక కడగాలి.

* మార్కెట్‌లో ‘పోర్‌ స్ట్రైప్స్‌’ దొరుకుతాయి. వీటితో బ్లాక్‌హెడ్స్‌ను తొలగించుకోవడం సులువు. ఆవిరి పట్టడం వల్లా ఈ సమస్యను అధిగమించవచ్చు.

* వారంలో కనీసం రెండుసార్లు అయినా మృతకణాలను తొలగించుకునేందుకు స్క్రబ్‌ చేయాలి. పావుకప్పు పెసరపిండి, కొద్దిగా పంచదార, చెంచా బొప్పాయి గుజ్జు, కాస్త నువ్వుల నూనె కలిపి ముఖానికి రాసి రుద్దాలి.

* గుడ్డు తెల్లసొనలో కాస్తంత తేనె కలిపి ఈ మిశ్రమాన్ని బ్లాక్‌హెడ్స్‌ ఉన్న చోట రాసి మృదువుగా మర్దన చేయాలి. అరగంటాగి గోరువెచ్చటి నీటితో కడిగేయాలి. వారానికోసారి ఈ పూత వేసుకోవాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని