మజ్జిగను ఇలానూ వాడొచ్చు...

మండుటెండల్లో సేదతీరడానికి మజ్జిగను మించింది లేదు కదూ... దీంతో ఆరోగ్యాన్నే కాదు కురులను, చర్మాన్నీ సంరక్షించుకోవచ్చు అంటున్నారు నిపుణులు. దీన్ని ఎలా వాడాలో చూసేద్దామా మరి...

Published : 29 Apr 2023 00:21 IST

మండుటెండల్లో సేదతీరడానికి మజ్జిగను మించింది లేదు కదూ... దీంతో ఆరోగ్యాన్నే కాదు కురులను, చర్మాన్నీ సంరక్షించుకోవచ్చు అంటున్నారు నిపుణులు. దీన్ని ఎలా వాడాలో చూసేద్దామా మరి...

చర్మ సంరక్షణకు

* మజ్జిగలో నారింజ తొక్కల పొడిని కలిపి మెత్తగా గుజ్జులా చేసి ముఖానికి పట్టించొచ్చు. దీనివల్ల చర్మంపై మచ్చలు ఉండవు. నల్లటి ఛాయలు లేకుండా చేస్తుంది.

* బాదం నూనె, రోజ్‌ వాటర్‌లో దీన్ని కలిపి రాస్తే క్లెన్సర్‌గా ఉపయోగపడుతుంది. స్నానానికి ముందు దీన్ని ఒంటి నిండా పట్టించి, ఆరాక గోరువెచ్చటి నీటితో కడిగేస్తే శరీరంపై పేరుకు పోయిన మురికంతా శుభ్రమవుతుంది.

* తేనెను మజ్జిగలో కలిపి శరీరమంతటికి రాసుకోవచ్చు. ఇది సహజ వైట్‌నర్‌గా పనిచేస్తుంది. మంచి ఫలితాల కోసం రోజూ దీన్ని ఉపయోగించొచ్చు.

* టొమాటో, ఆలివ్‌ లేదా బాదం నూనెను మజ్జిగలో సమపాళ్లలో కలిపి రాసుకుంటే జిడ్డు పోతుంది. మసాజ్‌ చేసుకుంటే మంచి ఫలితాలను పొందొచ్చు.

కురుల కోసం

మజ్జిగలో ఉండే లాక్టిక్‌ యాసిడ్‌ చుండ్రును తొందరగా వదిలిస్తుంది. ఒక చిన్న కప్పు మజ్జిగలో సరిపడా నిమ్మకాయ రసం కలిపి, అరగంట నానబెట్టాలి. ఆ మిశ్రమాన్ని కురులకు పట్టించి మసాజ్‌ చేయాలి. రెండు గంటల తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగేస్తే సరి. చుండ్రు సమస్య దూరమవుతుంది. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే మంచి ఫలితాలను పొందొచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని