ఐరన్‌నిచ్చే ఊదలు

అన్నానికి ప్రత్యామ్నాయంగా మిల్లెట్స్‌ను ఎంచుకుంటున్న వారెందరో. కాస్త దాని రుచికి దగ్గరగా ఉండాలనుకునేవారు ఊదలను తీసుకోవచ్చు. వీటితో బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.

Published : 08 Jul 2021 00:36 IST

అన్నానికి ప్రత్యామ్నాయంగా మిల్లెట్స్‌ను ఎంచుకుంటున్న వారెందరో. కాస్త దాని రుచికి దగ్గరగా ఉండాలనుకునేవారు ఊదలను తీసుకోవచ్చు. వీటితో బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.

కెలొరీలు తక్కువ, ఫైబర్‌, ప్రొటీన్‌, మినరల్స్‌ ఎక్కువగా ఉంటాయి. ఒకసారి తీసుకుంటే రోజులో శరీరానికి అవసరమైన ఐరన్‌ను అందిస్తుంది. ఎనీమియాతో బాధపడేవారు, హిమోగ్లోబిన్‌ శాతాన్ని త్వరగా పెంచుకోవాలనుకునేవారు దీన్ని తరచూ తీసుకోవొచ్చు.

* ఫైబర్‌ ఎక్కువ. కొన్ని రకాల క్యాన్సర్‌లను దూరంగా ఉంచుతుంది. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఉత్తమ ఎంపిక. దీనిలోని అమైలేజ్‌ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

* కొలస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. దీనిలోని లినోలిక్‌, పల్మిటిక్‌, ఒలియాక్‌ ఆసిడ్‌లు గుండె సంబంధ వ్యాధులు రాకుండా నిరోధిస్తాయి. గ్లూకోజ్‌ స్థాయులూ తక్కువే. కాబట్టి మధుమేహం ఉన్నవారూ తీసుకోవచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్