ఈ క్రిస్మస్‌కి.. సహజంగా అలంకరిద్దామా!

లైట్లు, డెకరేటివ్‌ ఐటమ్స్‌తో క్రిస్మస్‌రోజు ఇంటినంతా అలంకరించేస్తాం కదా! ఈసారి వాటిలో మొక్కలను చేర్చండి. ఇంటికి జీవం రావడంతోపాటు ఆరోగ్యమూ లభిస్తుంది.

Published : 24 Dec 2021 00:57 IST

లైట్లు, డెకరేటివ్‌ ఐటమ్స్‌తో క్రిస్మస్‌రోజు ఇంటినంతా అలంకరించేస్తాం కదా! ఈసారి వాటిలో మొక్కలను చేర్చండి. ఇంటికి జీవం రావడంతోపాటు ఆరోగ్యమూ లభిస్తుంది.

* రోజ్‌మెరీ, క్రిస్మస్‌ల అనుబంధం ఈనాటిది కాదు. బాల ఏసు ఊయల్లో ఉన్నవాటిల్లో దీన్నీ ఒకదానిగా చెబుతారు. పొడవైన రోజ్‌మెరీ కొమ్మలకు ఎర్రని రిబ్బన్లు కట్టి ఇంట్లో అక్కడక్కడా వేలాడదీయండి. చూడచక్కగా ఉంటాయి.

* ఎర్ర గులాబీల గుత్తుల్ని డైనింగ్‌ టేబుల్‌, టీపాయ్‌ వంటి చోట్ల అక్కడక్కడా ఉంచండి. అందంతోపాటు వాటి సువాసనలు ఉల్లాసాన్ని కలిగిస్తాయి. కాస్త విచ్చిన మొగ్గలు తెచ్చుకుంటే రెండు రోజులపాటు అలాగే ఉంటాయి.

* ఆంథూరియమ్‌ మొక్కల్ని ఇంట్లో అక్కడక్కడా ఉంచండి. ఫ్లెమింగ్‌ ఫ్లవర్‌, పిగ్‌ టెయిల్‌ ప్లాంట్‌, హవాలియన్‌ హార్ట్‌గా పిలిచే.. హృదయాకారంలో ఉండే దీని ఎర్రని పూలు వేడుకకు చక్కని జత. చుట్టూ క్యాండిల్స్‌ వెలిగిస్తే చాలు.

* క్రిస్మస్‌ పామ్‌ అందుబాటులో లేనివాళ్లు అరెకా పామ్‌ను ప్రయత్నించొచ్చు. దీన్ని పెంచడం సులువు, గాలినీ స్వచ్ఛంగా చేస్తుందిది. గదిలో ఓ మూలన ఉంచి, రిబ్బన్‌లు, బాల్స్‌, చిన్న లైట్లతో అలంకరిస్తే సరి! క్రిస్మస్‌ ట్రీ సిద్ధం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్