దోమల్ని తరిమేయొచ్చిలా..

ఇలా వర్షాలు మొదలయ్యాయో లేదో అలా వచ్చేశాయండీ దోమలు. దాంతో మలేరియా, డెంగ్యూ జ్వరాలూ ఎక్కువయ్యాయి. మరి దూరం చేసేందుకు ఏం చేయాలంటే.... 

Published : 19 Aug 2022 00:53 IST

ఇలా వర్షాలు మొదలయ్యాయో లేదో అలా వచ్చేశాయండీ దోమలు. దాంతో మలేరియా, డెంగ్యూ జ్వరాలూ ఎక్కువయ్యాయి. మరి దూరం చేసేందుకు ఏం చేయాలంటే.... 

* గ్లాసు నీటికి 3-4 టేబుల్‌ స్పూన్ల చొప్పున వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌, నిమ్మరసం, లావెండర్‌ నూనె కలిపి ఒక స్ప్రే బాటిల్‌లో పోయండి. దీన్ని చేతులు, కాళ్ల మీద స్ప్రే చేసుకుంటే సరి. ఉపయోగించే ప్రతిసారీ బాగా షేక్‌ చేయాలి.

* పావు కప్పు కొబ్బరినూనెకు మూడు స్పూన్ల టీట్రీ ఆయిల్‌, వేప, పుదీనా నూనెల్లో ఏదో ఒకదాన్ని కలపాలి. దీన్ని స్ప్రే బాటిల్‌లో పోసి బాగా షేక్‌ చేసి బయటకు వెళుతున్నప్పుడు, రాత్రి నిద్రపోయే ముందు కాళ్లు, చేతుల మీద చల్లుకుంటే సరి. 90 మి.లీ. ఆలివ్‌ నూనెకు 10 మి.లీ. లెమన్‌, యూకలిప్టస్‌ ఆయిల్‌ కలిపి రాసినా ఫలితం ఉంటుంది.

* ఆహారంలో వెల్లుల్లి, లవంగం ఎక్కువగా తీసుకోండి. ఈ కాలంలో బ్యాక్టీరియా, వైరస్‌ల వల్ల జబ్బుపడే అవకాశాల్ని తగ్గించడమే కాదు.. దోమలు దరి చేరకుండానూ చూస్తాయట.

* ఒక ప్రమిదలో వేప నూనె, నిమ్మ నూనె కలిపి పోసి.. వెలిగిస్తే ఇంట్లో దోమల బెడద ఉండదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్