వంటగది.. సౌకర్యంగా

వంటగదిని ఎప్పటికప్పుడు ఎంత శుభ్రంచేసినా... రెండు రోజులకి మళ్లీ మామూలే. వస్తువులు స్థానాలు మారిపోవడం, నూనె జిడ్డు లాంటి ఎన్నో సమస్యలు. ఈ చిట్కాలు పాటించండి. పని సులువవుతుంది.

Updated : 17 Aug 2023 04:23 IST

వంటగదిని ఎప్పటికప్పుడు ఎంత శుభ్రంచేసినా... రెండు రోజులకి మళ్లీ మామూలే. వస్తువులు స్థానాలు మారిపోవడం, నూనె జిడ్డు లాంటి ఎన్నో సమస్యలు. ఈ చిట్కాలు పాటించండి. పని సులువవుతుంది.

  • అలమరల్లో అడుగున న్యూస్‌ పేపర్లు వేస్తున్నారా? అవేమో త్వరగా నలిగి పోతాయి. దీంతో తరచూ మార్చక తప్పదు. బదులుగా యాంటీ స్కిడ్‌ మ్యాట్‌ లేదా వాటర్‌ప్రూఫ్‌ షీట్‌లు వేయండి. పాడవ్వవు, తడి వస్త్రంతో తుడిస్తే మరకలూ మాయం.
  • పొయ్యి వెనుక గోడపై నూనె మరకలు ఓ పట్టాన వదలవు. అల్యూమినియం ఫాయిల్‌ని గోడకూ, గట్టుకీ అతికించేయండి. దీని మీద జిడ్డు నిలవదు. అత్యధిక ఉష్ణోగ్రతల్నీ తట్టుకుంటుంది. శుభ్రం చేసుకోవడమూ సులువే.
  • పొయ్యిమీద కూర పెట్టి వేరే పనులు చేసుకోవడం మనకు మామూలే. ఇవి బాగా మరుగుతున్నా, వేగుతున్నా చిందుతుంటాయి. తాలింపు వేసినా సరే... మూత పెట్టేయండి. సమస్య తగ్గుతుంది.
  • వంటగదిలో ఉన్న సరకుల్ని ఎంత అవసరమో అన్నే ఉంచుకోండి. మిగిలినవాటిని పాంట్రీలోనో, స్టోరేజ్‌ బాక్సులోనో సర్దేయండి. దీనివల్ల సీసాలు, ఇతర వస్తువులు గీతలూ, దుమ్ము పడి పాతవిగా మారిపోవు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్