ముఖమంతా.. మొటిమలే
నా వయసు 16. కొన్నేళ్లుగా ముఖమంతా మొటిమలతో బాధపడుతున్నా. చాలామంది వైద్యుల్ని కలిసినా ప్రయోజనం లేదు. ఏం చేయాలి?
నా వయసు 16. కొన్నేళ్లుగా ముఖమంతా మొటిమలతో బాధపడుతున్నా. చాలామంది వైద్యుల్ని కలిసినా ప్రయోజనం లేదు. ఏం చేయాలి?
- ఓ సోదరి
ఇదో దీర్ఘకాల సమస్య. టీనేజీ పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. అధిక మోతాదులో నూనెలు విడుదలవ్వడం, చర్మరంధ్రాల్లో మృతకణాలు అడ్డుపడటం, హార్మోనుల్లో అసమతౌల్యం, పీసీఓఎస్, అధిక స్థాయిలో టెస్టోస్టీరాన్ ఉండటం ఇలా దీనికి బోలెడు కారణాలున్నాయి. వంశపారంపర్యమూ కావొచ్చు. ప్రీ యాక్నే ఇన్ఫెక్షన్లు, ఒత్తిడి.. వాతావరణ మార్పులూ, ఎక్కువగా దుమ్ములో తిరగడం, హెల్మెట్ రోజూ వాడుతుండటం, మేకప్ సరిగా తొలగించకపోవడం, కొన్నిరకాల కేశ ఉత్పత్తుల వల్లా మొటిమలు వస్తుంటాయి.
బ్లాక్, వైట్స్‌హెడ్స్ వల్ల వస్తే తక్కువ మొత్తంలో ఉంటాయి. వీటికి.. బెంజైల్ పెరాక్సైడ్, క్లింటమాయిసిన్, నికోటనమాయిడ్, టాపికల్ రెటినాయిడ్స్ క్రీములను రాస్తే సరిపోతుంది. చీముతో ఉంటే.. బెంజైల్ పెరాక్సైడ్, టాపికల్ రెటినాయిడ్స్, సాల్సిలిక్ ఆసిడ్ ఉన్న ఫేస్‌వాష్‌లు, నియాసినమైడ్, క్లెండమైసిన్ క్రీమ్‌లతోపాటు యాంటీ బయాటిక్స్‌నూ తీసుకోవాలి. కొన్ని నొప్పితోకూడి దీర్ఘకాలం ఉండి పోతాయి. వీటిని స్టబర్న్ యాక్నే అంటాం. చర్మలోతుల్లోంచి వస్తాయివి. టాపికల్ క్రీమ్‌లు, యాంటీ బయాటిక్స్ ఇస్తాం. అయినా తగ్గకపోతే ఓరల్ రెటినాయిడ్స్, కెమికల్ పీల్స్, లేజర్ ట్రీట్‌మెంట్, లైట్ థెరపీ ఇస్తాం. వీటితో మచ్చలూ పోతాయి. ఇంకా చిన్న వయసే కాబట్టి, క్రీమ్‌లు, యాంటీ బయాటిక్స్ సరిపోతాయి. అయితే ఇవి ఒకటి, రెండుసార్లకే పోవు. కొంత కాలం క్రమం తప్పక కొనసాగించాలి. వీటితోపాటు ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం చేయడంతోపాటు ఒత్తిడికీ దూరంగా ఉండేలా చూసుకోవాలి. మీ చర్మతీరుకు తగ్గ ఫేస్‌వాష్‌ను రోజుకు 2-3 సార్లు వాడండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.