ఇప్పుడు సరేనని తర్వాత కాదంటే..?
నాది సాఫ్ట్‌వేర్ ఉద్యోగం. డే, నైట్ షిఫ్టులుంటాయి. ఇటీవలే పెళ్లి కుదిరింది. తనేమో వ్యాపారి. ఇద్దరివీ వేర్వేరు రంగాలు. నా పని సంస్కృతి, సమయాలు అతని వాటితో పోలిస్తే భిన్నం. సమన్వయం కుదురుతుందా అని భయమేస్తోంది.
నాది సాఫ్ట్‌వేర్ ఉద్యోగం. డే, నైట్ షిఫ్టులుంటాయి. ఇటీవలే పెళ్లి కుదిరింది. తనేమో వ్యాపారి. ఇద్దరివీ వేర్వేరు రంగాలు. నా పని సంస్కృతి, సమయాలు అతని వాటితో పోలిస్తే భిన్నం. సమన్వయం కుదురుతుందా అని భయమేస్తోంది. తీరా ఇప్పుడు సరేనని భవిష్యత్తులో ఉద్యోగం మానేయమంటే ఏం చేయాలి?
- వల్లి, హైదరాబాద్
* ఉద్యోగినులు, రాత్రి పనివేళలపై చాలా పరిశోధనలే జరుగుతున్నాయి. వీటి ప్రభావం ఆరోగ్యంపైనే కాదు.. కుటుంబంపైనా పడుతోంది. వీలైతే నైట్ షిఫ్ట్‌లకు దూరంగా ఉండమనే నా సలహా. ఇప్పుడు సరేనన్నా దీర్ఘకాలంలో సమస్యలు తప్పవు. జీవగడియారం దెబ్బతిని అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నా.. ఉద్యోగాన్ని వదులుకోలేక కొనసాగుతున్న మహిళలే ఎక్కువ. ఇక కుటుంబ పరంగా.. ఎంత సంపాదించినా ఇంటిపని ఆడవాళ్లదే. ఈ విషయంలో పూర్తి మార్పు ఆశించడానికి ఇంకా ఏళ్లు పడుతుంది. పిల్లలు పుడితే రాత్రివేళల్లో పనిచేస్తూ ఇటు కుటుంబాన్నీ, ఉద్యోగాన్నీ సమన్వయం చేసుకోవడం చాలా కష్టం. కాబట్టి, ఇప్పుడే వేరే ఉద్యోగంలోకి మారండి. లేదంటే భవిష్యత్తులో మీరు భయపడ్డట్టే సమస్యలు ఖాయం.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.