షాంపూలు మార్చినా..లాభం లేదు!

కాలమేదైనా చుండ్రు వేధిస్తోంది. తలస్నానం చేసిన రెండోరోజుకే కనిపిస్తోంది. షాంపూలు ఎన్ని మార్చానో! అయినా ఫలితం మాత్రం కనిపించట్లేదు. ఏం చేయను?

Published : 30 Jul 2023 00:05 IST

కాలమేదైనా చుండ్రు వేధిస్తోంది. తలస్నానం చేసిన రెండోరోజుకే కనిపిస్తోంది. షాంపూలు ఎన్ని మార్చానో! అయినా ఫలితం మాత్రం కనిపించట్లేదు. ఏం చేయను?

- ఓ సోదరి

పొలుసుల్లా ఊడుతూ.. మాడుపై ఎరుపుదనం, దురద ఉంటే సెబోరిక్‌ డెర్మటైటిస్‌గా చెబుతాం. ఇది చాలా కొద్దిమందిలో ముక్కు పక్కన, చెవుల వెనక, కనురెప్పల వద్ద కూడా కనిపిస్తుంది. పసిపిల్లల నుంచి అన్ని వయసుల వారిలోనూ కనిపిస్తుంది. చాలావరకూ వంశపారంపర్యం. చిన్నవాళ్లలో దానంతటదే తగ్గిపోతుంది. టీనేజీ, పెద్దవాళ్ల దగ్గరికొచ్చేసరికి తరచూ పొట్టులా రాలుతుంది. కొన్నిసార్లు జిడ్డుచర్మం, తలలో నూనెలు ఎక్కువగా విడుదలయ్యేవారు, డైట్‌ పేరుతో సరిగా ఆహారం తీసుకోని వాళ్లలోనూ కనిపిస్తుంది. ఇదేమీ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించదు కాబట్టి, భయపడాల్సిన పనిలేదు. ఓసారి వైద్యుల వద్ద పరీక్ష చేయించుకొని టాపికల్‌ క్రీములు, షాంపూలు వాడితే సరిపోతుంది. ఎరుపుదనం లేదు కానీ దురద, పొట్టులా రాలుతోంటే డాండ్రఫ్‌గా చెబుతాం. పొడిచర్మం, ఒత్తిడి, చలి, కాలుష్యం, రసాయనాలున్న ఉత్పత్తులు ఎక్కువగా వాడి, వాటిని సరిగా శుభ్రం చేయకపోవడం.. ఇలా దీనికీ బోలెడు కారణాలు. ఒత్తిడి తగ్గించుకునే మార్గాలపై దృష్టిపెట్టండి. ఇంకా వారానికి 2-3 సార్లు తప్పక తలస్నానం చేయాలి. నిమ్మరసం, పుల్లటి పెరుగు మాడుకి పట్టించి, పావుగంటయ్యాక తలస్నానం చేయండి. టీట్రీఆయిల్‌, కోల్టార్‌, కీటోకొనజాల్‌, సెలెనియం సల్ఫైడ్‌, జింక్‌ పైరిథాన్‌, సాల్సిలిక్‌ యాసిడ్‌ ఉన్న షాంపూ రకాలను ఎంచుకోండి. చుండ్రుతోపాటు దురద, మాడు పొడిబారడం, ఈస్ట్‌ కారణంగా వచ్చే ఇన్‌ఫ్లమేషన్‌ వగైరా అన్నీ దూరమవుతాయి. వీటితోపాటు తీసుకునే ఆహారంపైనా దృష్టిపెట్టండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్