అన్నతో మాట్లాడినా అనుమానమే...

నాకు పెళ్లై ఐదేళ్లవుతోంది. భర్త ఐటీ ఉద్యోగి. మాకు ఇద్దరమ్మాయిలు. ఎందుకో తెలియదు కానీ మొదటి నుంచీ నాపై ఆయనకు అనుమానమే. అన్న వరసయ్యే వాళ్లతో మాట్లాడినా అనుమానపడతాడు. నేను ఉద్యోగం చేయట్లేదని దెప్పిపొడుస్తుంటాడు. చాలాసార్లు పిల్లల ముందే చేయి చేసుకుంటాడు. ఇటువంటి బంధంలో ఉండాలో లేదో తెలియక సతమతమవుతున్నాను.

Published : 29 Jan 2024 02:12 IST

నాకు పెళ్లై ఐదేళ్లవుతోంది. భర్త ఐటీ ఉద్యోగి. మాకు ఇద్దరమ్మాయిలు. ఎందుకో తెలియదు కానీ మొదటి నుంచీ నాపై ఆయనకు అనుమానమే. అన్న వరసయ్యే వాళ్లతో మాట్లాడినా అనుమానపడతాడు. నేను ఉద్యోగం చేయట్లేదని దెప్పిపొడుస్తుంటాడు. చాలాసార్లు పిల్లల ముందే చేయి చేసుకుంటాడు. ఇటువంటి బంధంలో ఉండాలో లేదో తెలియక సతమతమవుతున్నాను.

గీత

భార్య లేదా భర్త ఒకరిపై ఒకరు అనుమానాలు పెంచుకుని... భాగస్వామిని హింసించటం, దారుణాలకు ఒడికట్టడం... వంటివి సమాజంలో కొన్నిసార్లు చూస్తుంటాం. ఏ కారణం లేకున్నా అందరితో సంబంధాలు అంటగట్టి బాధపెడుతుంటారు. దీనికి ఆత్మన్యూనతా భావం, అసూయ, ఇతరులపై నమ్మకం లేకపోవటం లేదా వివాహేతర సంబంధాల గురించి ఎక్కువగా ఆలోచిస్తుండటం వల్ల ఇలా ప్రవర్తిస్తుంటారు. ఇది ‘డెల్యూజనల్‌ డిజార్డర్‌’ అనే మానసిక రుగ్మత. మిగతా విషయాలన్నింటిలో వీళ్లు బాగానే ఉంటారు. కానీ దాంపత్య జీవితంలో ఒకరినొకరు అనుమానించుకుంటూ ఉంటారు. వాళ్ల ప్రవర్తనను బయట వ్యక్తులకు చెప్పినా ఎవరూ నమ్మలేరు.

మీ పరిస్థితి కూడా అటువంటిదే. ఏది ఏమైనా ముందు మీ కుటుంబ సభ్యులతో మాట్లాడి సైకియాట్రిస్ట్‌ను సంప్రదించండి. అవసరమైతే అతనికి సైకలాజికల్‌ టెస్ట్‌ చేస్తారు. ఈ డిజార్డర్‌ను గుర్తిస్తే... యాంటీ సైకాటిక్స్‌ మందులతో దాన్ని తగ్గించవచ్చు. ఇటువంటి అపోహలూ భ్రమలూ తొలగిపోతాయి. అతను మిమ్మల్ని బాధపెట్టడమూ తగ్గుతుంది. కాబట్టి అతని నుంచి విడిపోవాలనే ఆలోచన వద్దు. మీ పిల్లల భవిష్యత్తూ ముఖ్యమే. చికిత్స అందితే క్రమంగా అతనికి నయమై, మీపై నమ్మకం కుదురుతుంది. ఆ తర్వాత మీరూ ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్