Onion: ఉల్లి... నెలసరికి మేలు
ఉల్లిచేసే మేలు తల్లి కూడా చేయదు అంటారు పెద్దలు. మరి ఆ ప్రయోజ నాలేంటో తెలుసుకుందామా...
ఉల్లిచేసే మేలు తల్లి కూడా చేయదు అంటారు పెద్దలు. మరి ఆ ప్రయోజనాలేంటో తెలుసుకుందామా...
నాలుగు టీ స్పూన్ల ఉల్లిరసాన్ని రోజుకి రెండు సార్లు చొప్పున తీసుకుంటే శరీరంలో జరిగే అంతర్గత రక్తస్రావాలను నియంత్రించడానికి ఉపయోగపడుతుంది.
* ఉల్లి రసాన్ని, నెయ్యిని స్పూను చొప్పున తీసుకుని బాగా కలిపి మూడుపూటలా తీసుకుంటే బలహీనత తగ్గి, శక్తి పుంజుకుంటాం.
* రెండు ఉల్లిపాయల్ని కచ్చాపచ్చాగా దంచి దానిలో రెండు టేబుల్ స్పూన్ల వెనిగర్ కలిపి తీసుకుంటే జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది.
* రెండు టేబుల్‌స్పూన్ల ఉల్లి రసానికి అదే పరిమాణంలో నిమ్మరసాన్ని, చిటికెడు ఉప్పుని కలిపి తీసుకుంటే కడుపునొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
* మూత్రాశయంలో మంట నివారణకు రెండు ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కోసి లీటరునీటిలో మరిగించి ఆరారగా తాగితే చక్కని ఫలితం ఉంటుంది.
* నాలుగు టీస్పూన్ల ఉల్లిరసానికి మంచి నూనెలో పొంగించిన చిటికెడు ఇంగువకు, కొద్దిగా నల్లఉప్పును కలిపి చప్పరిస్తే కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలు తగ్గుతాయట.
* పచ్చి ఉల్లిపాయను రోజూ తింటే రుతుక్రమ అపసవ్యతలనూ నివారిస్తుంది.
* రోజూ ఒక పచ్చి ఉల్లిపాయని తినగలిగితే చక్కెర వ్యాధి నియంత్రణలో ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.