‘బ్యాడ్ టచ్’ గురించి మా పాపకు ఎలా చెప్పాలి?

మా పాపకు పదేళ్లు. అమ్మాయిలకు రక్షణ లేకుండా పోయిన ప్రస్తుత పరిస్థితుల్లో తనకి ‘గుడ్ టచ్’, ‘బ్యాడ్ టచ్’ గురించి చెప్పాలనుకుంటున్నాను. అయితే ఏ విధంగా వివరించాలో తెలుపగలరు? - ఓ సోదరి

Published : 23 Feb 2024 16:38 IST

మా పాపకు పదేళ్లు. అమ్మాయిలకు రక్షణ లేకుండా పోయిన ప్రస్తుత పరిస్థితుల్లో తనకి ‘గుడ్ టచ్’, ‘బ్యాడ్ టచ్’ గురించి చెప్పాలనుకుంటున్నాను. అయితే ఏ విధంగా వివరించాలో తెలుపగలరు? - ఓ సోదరి

జ. ప్రస్తుత సమాజంలో అమ్మాయిలకు ఎటువైపు నుంచి, ఎప్పుడు, ఏ ఆపద వస్తుందో తెలియట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో చిన్న పిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి తెలియజేయడం చాలా అవసరం. అయితే ఇలాంటి సున్నితమైన విషయాలను చాలా జాగ్రత్తగా చెప్పాల్సి ఉంటుంది.

ఇందుకు ఓ పద్ధతి, ప్రణాళిక ముఖ్యం. అంటే వాళ్ల వయసుకు తగినట్టుగా చిన్న చిన్న సంఘటనలు, కథల రూపంలో చెప్పాల్సి ఉంటుంది. ఎదుటి వ్యక్తి ఏ విధంగా ప్రవర్తించినప్పుడు బ్యాడ్ టచ్ కింద భావించవచ్చో స్పష్టంగా చెప్పండి. ఉదాహరణకు అభ్యంతరకర ప్రదేశాల్లో తాకడం, అసహజంగా ప్రవర్తించడం, ఒంటరిగా ఎవరూ లేని చోటుకు తీసుకెళ్లడం, అభ్యంతరకరమైన పనులు చేయడం.. ఇలాంటివన్నీ చిన్న చిన్న కథల రూపంలో వారికి అర్థమయ్యే రీతిలో చెప్పే ప్రయత్నం చేయండి.

మీరు చెప్పే విధానం నమ్మదగిన వాళ్లను కూడా నమ్మలేని పరిస్థితికి తీసుకొచ్చేదిగా ఉండకూడదు. మీరు ఏవిధంగా చెప్పినా వారు దానిని అర్థం చేసుకొని పాటించే విధంగా ఉండాలి కానీ భయభ్రాంతులకు గురయ్యే విధంగా ఉండకుండా చూసుకోండి. చిన్న చిన్న మాటల్లో, పదాల్లో వాళ్లకు అర్థమయ్యే రీతిలో ఉదాహరణలు ఇస్తూ చెప్పే ప్రయత్నం చేయండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్