మోచిప్పలకూ మెరుపు

మృదువుగా కనిపించే చేతుల వెనుక మోచేయి కూడా అదే రంగులో ఉంటేనే చూడటానికి బాగుంటుంది. అలాకాక నల్లగా ఉంటే కాస్త ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. మోచిప్పల నలుపు డ్రస్‌ అందాన్ని తగ్గిస్తుంది. దీన్ని తగ్గించే కొన్ని చిట్కాలివి...

Updated : 05 Jan 2022 02:10 IST

మృదువుగా కనిపించే చేతుల వెనుక మోచేయి కూడా అదే రంగులో ఉంటేనే చూడటానికి బాగుంటుంది. అలాకాక నల్లగా ఉంటే కాస్త ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. మోచిప్పల నలుపు డ్రస్‌ అందాన్ని తగ్గిస్తుంది. దీన్ని తగ్గించే కొన్ని చిట్కాలివి...

కారణాలు... చర్మంలోని మృతకణాలు ఒక్కచోట చేరిపోవడం, హైపర్‌ పిగ్మెంటేషన్‌ లేదా సూర్యకిరణాల ప్రభావంవల్ల కూడా అక్కడి చర్మం నలుపుగా మారుతుంది. కుటుంబనియంత్రణ మాత్రల వినియోగం, గర్భం దాల్చడం లేదా సొరియాసిస్‌ వంటి చర్మవ్యాధుల వల్ల ఈ సమస్య ఎదురవుతుంది. దీన్ని సహజసిద్ధమైన వాటితోనే పోగొట్టొచ్చు.

కలబంద గుజ్జుతో... రోజుకి రెండు సార్లు తాజాగా తీసిన కలబంద గుజ్జును లేపనంలా రాసి ఆరనివ్వాలి. 20 నిమిషాల తర్వాత చన్నీటితో శుభ్రం చేస్తే చాలు. క్రమేపీ నలుపు తగ్గుతుంది. చర్మాన్ని మెరిసేలా చేసే గుణాలున్న వంటసోడాను చెంచాడు తీసుకుని అందులో కొంచెం నీటిని కలిపి, ఈ మిశ్రమాన్ని నలుపు ఉన్నచోట రాసి పావుగంట తర్వాత కడిగితే చాలు. ఆ నలుపుపోతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని