లోదుస్తులు సౌకర్యంగా...

ఫ్యాషన్‌ను అనుసరిస్తూ ధరించే అవుట్‌ ఫిట్స్‌కు తగిన లోదుస్తులుండాలి. లేదా ఉన్నవాటిని కావాల్సినట్లుగా మార్చుకోవాలి. లేదంటే అసౌకర్యం ఎదురవుతుంది. అలా కాకుండా ఉండాలంటే..

Updated : 14 Mar 2024 14:24 IST

ఫ్యాషన్‌ను అనుసరిస్తూ ధరించే అవుట్‌ ఫిట్స్‌కు తగిన లోదుస్తులుండాలి. లేదా ఉన్నవాటిని కావాల్సినట్లుగా మార్చుకోవాలి. లేదంటే అసౌకర్యం ఎదురవుతుంది. అలా కాకుండా ఉండాలంటే..


వదులు కాకుండా...

షోల్డర్‌ ఫ్రీ, వదులైన భుజాలుండే టాప్స్‌ లేదా షర్ట్‌ వేసుకొన్నప్పుడు బ్రా స్ట్రాప్స్‌ బయటికి కనిపిస్తుంటాయి. చూడటానికీ బాగోదు. అటువంటప్పుడు బ్రా స్ట్రిప్స్‌ని వెనకవైపు దగ్గరకు తీసుకొచ్చి ఈ క్లిప్‌ పెడితే చాలు. సమస్య తీరినట్లే. అలాగే బ్యాక్‌ నెక్‌ పెద్దదిగా ఉన్నప్పుడు బ్రా హుక్‌ వద్ద ఈ ఎక్స్‌ట్రా స్ట్రాప్స్‌ను జత చేయాలి. దీంతో పొడవుగా మారిన స్ట్రిప్స్‌ను రెండువైపులా నడుం చుట్టూ వచ్చేలా తిప్పి ముందువైపు హుక్‌ పెట్టుకుంటే సరిపోతుంది.


అందంగా కనిపించేలా..

టైట్‌ఫిట్‌ కోటు, సూట్‌ లేదా బిగుతైన పార్టీ గౌను ధరించేటప్పుడు వాటికి తగినట్లుగా శరీర ఆకారం ఉండాలి. అప్పుడే దుస్తులు చూడ చక్కగా ఉంటాయి. నడుం, ఛాతీ వద్ద సరైన షేప్‌ రావడానికి ఈ సపోర్ట్‌ బెల్ట్‌ ఉపయోగపడుతుంది. షర్ట్‌ వేసుకునేముందుగా దీన్ని ధరిస్తే,  పొట్టభాగంలో బెల్ట్‌లా వచ్చి, నడుం, వీపు భాగాల వద్ద ఉన్న అదనపు కొవ్వు కనిపించకుండా సరైన ఆకృతిలోకి వచ్చేలా చేస్తుంది.


నొప్పి లేకుండా..

బ్రా బిగుతుగా ఉన్నప్పుడు స్ట్రాప్స్‌ ఒత్తిడి భుజంపై పడుతుంది. దీనివల్ల కండరాలు ప్రభావితమై నొప్పి మొదలవుతుంది. ఇలా జరగకుండా ఉండటానికి వచ్చినవే ఈ స్ట్రాప్‌ కుషన్స్‌. భుజంపై ఒత్తిడిగా ఉండే చోట స్ట్రాప్‌ కిందకి వచ్చేలా వీటిని అతికిస్తే చాలు. అలాగే బ్లవుజు, గౌను వంటివాటికి భుజాల వద్ద సరైన ఆకారం లేకపోతే దుస్తుల అందం తగ్గుతుంది. ఈ షోల్డర్‌ ప్యాడ్‌ను భుజంపై అతికిస్తే చాలు. దుస్తుల్లోపల సౌకర్యంగా, అందమైన ఆకారాన్ని అందించేలా ఇమిడిపోతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్