డ్రెస్సు డ్రెస్సుకో మ్యాచింగ్‌ స్క్రంచీ...

జుట్టుంటే ఏ ముడి అయినా వేయొచ్చంటారు. మరి ఆ ముడి వేయడానికి ఉపయోగపడేవే స్క్రంచీ హెయిర్‌ బ్యాండ్‌లు. ఒకప్పుడు బాగా ప్రాచుర్యంలో ఉన్న క్లాత్‌ హెయిర్‌ బ్యాండ్‌లు ఇప్పుడు మళ్లీ ట్రెండ్‌ అవుతున్నాయి.

Published : 15 Mar 2024 01:37 IST

జుట్టుంటే ఏ ముడి అయినా వేయొచ్చంటారు. మరి ఆ ముడి వేయడానికి ఉపయోగపడేవే స్క్రంచీ హెయిర్‌ బ్యాండ్‌లు. ఒకప్పుడు బాగా ప్రాచుర్యంలో ఉన్న క్లాత్‌ హెయిర్‌ బ్యాండ్‌లు ఇప్పుడు మళ్లీ ట్రెండ్‌ అవుతున్నాయి. క్యాజువల్‌, రఫుల్‌, ప్యాచ్‌వర్క్‌, కాటన్‌, ఆర్గాంజా, వెల్వెట్‌...లాంటి రకాల్లో మార్కెట్లోకి వచ్చేశాయ్‌. లాంగ్‌, షార్ట్‌, మీడియం జుట్టు దేనికైనా సరే చక్కగా నప్పే ఈ బ్యాండ్‌లు అమ్మాయిల మనసు దోచేయడమే కాదు పిల్లలకీ భలే లుక్కిస్తున్నాయి. వీటికి రెండు రిబ్బన్లు వేలాడేలానూ డిజైన్‌ చేస్తున్నారు. పైగా క్లాత్‌తో చేసినవి కాబట్టి ఎక్కువకాలం మన్నుతాయివి. అందుకే ఒక్కో డ్రెస్సుకూ ఒక్కో మ్యాచింగ్‌ బ్యాండ్‌నూ కొనేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్