తిండికీ ఓ పద్ధతి!

ఆరోగ్యం కోసం చాలామంది ఆహారంపై దృష్టిపెడుతుంటారు. కానీ అది మాత్రమే సరిపోదంటున్నారు నిపుణులు. మరేం చేయాలంటారా?

Updated : 15 Jun 2021 05:18 IST

ఆరోగ్యం కోసం చాలామంది ఆహారంపై దృష్టిపెడుతుంటారు. కానీ అది మాత్రమే సరిపోదంటున్నారు నిపుణులు. మరేం చేయాలంటారా?
టీవీ చూసేటప్పుడు చిరుతిండి తినడం చాలామందికి అలవాటు. దాని ధ్యాసలోపడి తెలియకుండానే ఎక్కువగా తినేస్తుంటారు. ఇది మంచి పద్ధతి కాదు. పనిచేస్తూ, డ్రైవింగ్‌లో, ఆఖరికి నడిచేటప్పుడూ తినొద్దట. తెలియకుండానే ఎక్కువ తినేసే అవకాశముంటుందట.
* తినే ప్రతిదాన్నీ కెలొరీల లెక్కలేసుకోవద్దు. ఇది ఆహారంపై అయిష్టతకి కారణమవుతుంది. అలా కాకుండా మీ శరీరానికి ఏం కావాలో, ఎంత కావాలో తెలుసుకుని, తీసుకోండి. ఈ విషయంలో నిపుణుల సలహా తీసుకోవడం మేలు.
* ఒత్తిడి, బాధలో ఉన్నపుడూ తిండివైపు మొగ్గుతుంటారు కొందరు. ఏవి తింటున్నారో, ఎంత తింటున్నారో మర్చిపోతుంటారు. ఇలాంటప్పుడు తిండి కాకుండా మనసును కుదుటపరిచే వేరే ప్రత్యామ్నాయాలను చూడాలి.
* డైట్‌లో ద్రవాలకూ ప్రాధాన్యమివ్వాలి. కానీ వాటిపైనే ఆధారపడొద్దు. తొందరగా జీర్ణమై ఆకలేస్తుంటుంది. అవి ఆకలిని కాసేపు ఆపినా.. శరీరానికి అవసరమైన పోషకాలు లభించవు.
* దేనికైనా త్వరిత ఫలితం కావాలంటారు చాలామంది. అందుకే వెంటనే డైట్‌ మార్చేస్తుంటారు. ఇదీ మంచి పద్ధతి కాదు. ఒక విధానానికి శరీరం అలవాటు పడి ఫలితాన్నివ్వడానికి కొంత సమయం పడుతుంది. వేచి చూడాల్సిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్