నవ్వేస్తే చాలుగా

పనులూ, చదువూ..., ఇంటి బాధ్యతలు, ఆఫీసు పనులు.... కారణాలేమైనా మహిళలు ఎక్కువగా ఒత్తిడి వలలో చిక్కుకుంటారు. అలాంటప్పుడు ఎలా బయటపడాలంటే!

Updated : 17 Oct 2021 07:16 IST

పనులూ, చదువూ..., ఇంటి బాధ్యతలు, ఆఫీసు పనులు.... కారణాలేమైనా మహిళలు ఎక్కువగా ఒత్తిడి వలలో చిక్కుకుంటారు. అలాంటప్పుడు ఎలా బయటపడాలంటే!

నవ్వేయండి: పసి పిల్లలు రోజులో 300 సార్లు నవ్వుతారట. అదే పెద్దవాళ్లు రోజులో 15 సార్లు కూడా నవ్వరట. కానీ నవ్వు శరీరంలోని ఒత్తిడికి కారణమయ్యే అడ్రినలిన్‌, కార్టిసాల్‌ హార్మోన్లని నియంత్రిస్తుంది.

పాదాలకు మర్దన: గోడను ఆసరాగా చేసుకుని రోలర్‌పై నిలబడి ముందుక్కీ... వెనక్కీ కదలండి. ఇలా చేస్తే మెదడు నుంచి సంతోషానికి కారణమయ్యే ఎండార్ఫిన్లు విడుదల అవుతాయి. లేదా కాసేపు గడ్డిలో ఒట్టి పాదాలతో నడిచినా మేలే.

పోషకాహారం: మనం తినే ఆహారంలోబి విటమిన్లు సమృద్ధిగా ఉండేట్టు చూసుకోవాలి. అప్పుడు సంతోషాన్ని పెంచే సెరటోనిన్‌ హార్మోను చక్కగా పనిచేస్తుంది. మెగ్నీషియం శరీరంలో సరిపడా ఉన్నప్పుడు కూడా ఇది సాధ్యమే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్