గర్భిణులకు కొబ్బరి నీళ్లు

మితిమీరిన ఎండలతో గొంతెండిపోవడం, తలనొప్పి, చెమటలు లాంటి అనేక ఇబ్బందులు తలెత్తుతాయి. ఇంటా బయటా పనిచేసే మహిళలకు ఈ కాలం మరింత అలసటగా ఉంటుంది. అలాంటప్పుడు కొబ్బరి బొండాంని చూస్తే ప్రాణం లేచొస్తుంది కదూ! నిస్సత్తువను తరిమికొట్టే కొబ్బరినీళ్లలో ఎన్ని సుగుణాలున్నాయో చూడండి...

Published : 15 Apr 2022 01:58 IST

మితిమీరిన ఎండలతో గొంతెండిపోవడం, తలనొప్పి, చెమటలు లాంటి అనేక ఇబ్బందులు తలెత్తుతాయి. ఇంటా బయటా పనిచేసే మహిళలకు ఈ కాలం మరింత అలసటగా ఉంటుంది. అలాంటప్పుడు కొబ్బరి బొండాంని చూస్తే ప్రాణం లేచొస్తుంది కదూ! నిస్సత్తువను తరిమికొట్టే కొబ్బరినీళ్లలో ఎన్ని సుగుణాలున్నాయో చూడండి...

* వేసవి తాపాన్ని తగ్గించడంలో కొబ్బరినీళ్లది మొదటి స్థానం. విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నందున ఇది సంపూర్ణ పోషకాహారం. డీహైడ్రేషన్‌ సమస్య తలెత్తదు.

* రోజూ ఒక కొబ్బరి బొండం తాగితే చర్మ సౌందర్యం ఇనుమడిస్తుంది. ముఖమూ, చేతులూ కాంతివంతంగా ఉంటాయి. జీర్ణప్రక్రియ పెంపొందుతుంది. మలబద్ధక సమస్య తలెత్తదు.

మధుమేహ రోగులకు రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంలో సాయపడుతుంది.  శరీరంలోని అధిక లవణాలను తొలగిస్తుంది. కొబ్బరి నీళ్లలో కొవ్వు లేనందున ఊబకాయం రాదు. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా నిరోధిస్తాయి. రక్తపోటు, గుండెపోటులను నివారిస్తాయి.

* ఈ కాలంలో వ్యాయామం చేసిన తర్వాత కొబ్బరినీళ్లు తాగితే అలసట తగ్గి ఉపశమనం కలుగుతుంది. వేడి చేయడం, కళ్ల మంటలు లాంటి ఇబ్బందులు తొలగుతాయి. గర్భిణులకు వాంతులు, వికారం లాంటి సమస్యలు ఎదురైనప్పుడు కొబ్బరినీళ్లు తాగితే సత్వర ఫలితం ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్