బద్ధకం వదిలించే కసరత్తులివి...

వ్యాయామం చేద్దామనీ, చురుగ్గా ఉందామని ఎంత ప్రయత్నించినా కొందరిని బద్ధకం వెంటాడుతూనే ఉంటుంది. అందుకే మంచం దిగాలంటే ఇబ్బంది పడేవారు.... పడకమీదే ఈ వ్యాయామాలు చేసి చూడండి. శరీరం సౌకర్యంగా సాగుతుంది.

Published : 05 Feb 2023 00:05 IST

వ్యాయామం చేద్దామనీ, చురుగ్గా ఉందామని ఎంత ప్రయత్నించినా కొందరిని బద్ధకం వెంటాడుతూనే ఉంటుంది. అందుకే మంచం దిగాలంటే ఇబ్బంది పడేవారు.... పడకమీదే ఈ వ్యాయామాలు చేసి చూడండి. శరీరం సౌకర్యంగా సాగుతుంది.

* ముందుగా వెల్లకిలా పడుకోండి. రెండు చేతులనూ కూడా కింద ఆనించాలి. ఇప్పుడు కాళ్లను సైకిల్‌ తొక్కుతున్నట్లుగా గాలిలోనే తిప్పండి. ఒకసారి ముందుకీ, మరోసారి వెనక్కి ఇలా కనీసం పది నుంచి పదిహేను సార్లు చేయాలి. దీనివల్ల కాలి కండరాలు బలంగా మారడమే కాదు... పొట్ట దగ్గర ఉండే కొవ్వూ త్వరగా కరుగుతుంది. శరీరమూ చురుగ్గా మారుతుంది.

* నేల మీద కాళ్లను ముందుకు చాపి కూర్చోవాలి. రెండు చేతులను కాలి బొటన వేళ్లకి సమాంతరంగా చాచాలి. ఇప్పుడు ఎడమచేత్తో గాల్లో పెద్ద వృత్తం చుట్టినట్టుగా చేసి చేతిని యథాస్థానానికి తీసుకురావాలి. తర్వాత కుడిచేత్తోనూ ఇలాగే చేయాలి. ఒక్కో చేత్తోనూ ఇలా ఇరవైసార్ల చొప్పున చేయాలి. దీనివల్ల భుజాల కదలికలు సౌకర్యవంతంగా మారతాయి.

* ఓ దిండుని ముందు పెట్టుకుని మోకాళ్ల మీద కూర్చోవడానికి ప్రయత్నించండి. సరిగ్గా కూర్చున్నాక... నడుం ఏ మాత్రం ముందుకి వంచకుండా దిండుపై నుంచి ఎంతవరకూ చేతుల్ని ముందుకు పెట్టగలరో చూడండి. అలా ఉండి దీర్ఘంగా శ్వాస తీసుకుని వదలండి. ఇలా కనీసం రెండు మూడు నిమిషాలైనా చేయండి. దీనివల్ల శరీరం మొత్తం చురుగ్గా మారుతుంది. అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్