పండ్లు ఎప్పుడు తినాలి?
పండ్లు ఆరోగ్యానికి మంచిదన్నది మనకు తెలిసిందే. సమస్యల్లా ఎప్పుడు తినాలనే! ఒకరు ఉదయం తినమంటే.. ఇంకొకరు సాయంత్రం మేలంటారు.
పండ్లు ఆరోగ్యానికి మంచిదన్నది మనకు తెలిసిందే. సమస్యల్లా ఎప్పుడు తినాలనే! ఒకరు ఉదయం తినమంటే.. ఇంకొకరు సాయంత్రం మేలంటారు. భోజనానికి ముందు, తర్వాత.. ఇలా బోలెడు సలహాలు. ఇంతకీ నిపుణులేమంటున్నారు?
⚛ పరగడుపునే తినొద్దు.. ఇది అపోహే! పండ్లలో ఫ్రక్టోజ్ అధిక మోతాదులో ఉంటుంది. రాత్రంతా విశ్రాంతి పొందిన శరీరానికి తక్షణ శక్తి అవసరం. బోలెడు పోషకాలుండటమే కాదు.. ఇవి త్వరగా జీర్ణమవుతాయి కూడా. ఎప్పుడు నీరసంగా అనిపించినా పండ్లను ఆశ్రయించొచ్చు. ఇంకా ఉదయాన్నే అల్పాహారంగా తీసుకుంటే శరీరంలో మలినాలు తొలగడమే కాదు.. బరువూ అదుపులో ఉంటుంది. అయితే మధుమేహులు మాత్రం ఖాళీ కడుపుతో పండ్లను తీసుకోవద్దు.
⚛ ఆహారం జీర్ణమవదు.. ఆహారం తిన్నాక పండ్లు తీసుకోకూడదు. త్వరగా జీర్ణమవదు. గ్యాస్ ఏర్పడటమే కాదు.. కడుపులోనూ ఇబ్బందని విన్నారా? అది వాస్తవం కాదంటున్నాయి అధ్యయనాలు. ఆహారం తీసుకున్నాక పండ్లను తింటే జీర్ణప్రక్రియ కాస్త ఆలస్యమవుతుంది అన్నమాట వాస్తవమే. కానీ అదేమీ అనారోగ్యాలకి దారితీయదు. కాస్త ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలుగుతుంది. బరువు తగ్గాలనుకునే అమ్మాయిలకు ఇదింకా మంచిది.
⚛ సాయంకాల వేళ.. శుభ్రంగా తీసుకోవచ్చు. భోజనాలకు మధ్య స్నాక్స్ తీసుకోవడం మనలో చాలామందికి అలవాటే. అవి అనారోగ్యకరమైనవి అయితే ఆహార వేళల్లో మార్పులొస్తాయి. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయులూ పెరుగుతాయి. వాటి బదులుగా నట్స్, విత్తనాలతో కలిపి పండ్లు తీసుకోండి. త్వరగా ఆకలి వేయదు.. పోషకాలూ అందుతాయి.
⚛ ఇక రాత్రి వేళ.. నిద్రకు రెండు గంటల ముందు మాత్రం పక్కన పెట్టేయండి. పండ్లు రక్తంలో చక్కెర స్థాయులను పెంచుతాయి. దీంతో మెదడు ఉత్తేజితమై నిద్ర రానీయవు. కాబట్టి.. అప్పుడు మాత్రం తీసుకోకుండా ఉంటే చాలు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.