తమలపాకుతో ఆరోగ్యం....

నవరాత్రుల్లో ముత్తైదువులను ఇంటికి పిలిచి తాంబూలం అందిస్తుంటాం. ఇందులోని తమలపాకులో ఆరోగ్యప్రయోజనాలెన్నో ఉన్నాయి. అవేంటో చూద్దాం.

Updated : 22 Oct 2023 04:12 IST

నవరాత్రుల్లో ముత్తైదువులను ఇంటికి పిలిచి తాంబూలం అందిస్తుంటాం. ఇందులోని తమలపాకులో ఆరోగ్యప్రయోజనాలెన్నో ఉన్నాయి. అవేంటో చూద్దాం.

  • ఇందులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో పీహెచ్‌ స్థాయులను నిలకడగా ఉంచుతాయి. జీర్ణ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం  కలిగిస్తాయి. మలబద్ధకం దూరమవుతుంది.  
  • దీనిలో యాంటీమైక్రోబియల్‌ లక్షణాలు ఉంటాయి. నోటి దుర్వాసన, దంత సమస్యలను ఇవి దూరం చేస్తాయి. భోజనం తర్వాత  తమలపాకులను నమిలి మింగితే దంతాల నొప్పి, చిగుళ్ల వాపు, నోటి ఇన్‌ఫెక్షన్‌ వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.
  • దగ్గు, ఉబ్బసం వంటి శ్వాసకోశ వ్యాధుల చికిత్సకు తమలపాకులు మంచి మందు.
  • ఒత్తిడి, ఆందోళన అనిపించినప్పుడు తమలపాకును నమలడం వల్ల మనసుకు విశ్రాంతిగా అనిపిస్తుంది. దీనిలోని ఫినాలిక్‌ సమ్మేళనాలు శరీరం నుంచి కర్బన సమ్మేళనాలను విడుదలయ్యేలా చేస్తాయి. ఆందోళన, ఒత్తిడి తగ్గి ఆరోగ్యం మెరుగుపడుతుంది.
  • తమలపాకులోని యాంటీ హైపర్‌గ్లైసీమిక్‌ గుణాలు షుగర్‌ వ్యాధిని అదుపులో ఉంచుతాయి. రక్తంలో గ్లూకోజ్‌ స్థాయిలు పెరగకుండా నివారిస్తాయి.డయాబెటిస్‌ ఉన్నవాళ్లు పరగడుపున తమలపాకులను నమలటం మంచిది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్